Microsoft: హైదరాబాద్‌ టెక్ పరిశ్రమలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచ సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాప్ట్‌ ఇండియా ఆర్‌ అండ్‌విభాగం గచ్చిబౌలిలో భారీ స్థలాన్ని లీజుకు తీసుకుంది. ఫినిక్స్‌ సంటారస్‌లోని 2.65 లక్షల చదరపు అడుగుల భారీ ఆఫీస్‌ స్థలాన్ని తీసుకుంది. ఈ స్థలం కోసం మైక్రోసాఫ్ట్ సంస్థ నెలకు 5.4 కోట్ల రూపాయల అద్దె చెల్లించనుంది. ఇది ఈ ఏడాదిలో హైదరాబాద్‌లో జరిగిన అతి పెద్ద ఆఫీస్ లీజు ఒప్పందాల్లో ఒకటిగా విశ్లేషకులు చెబుతున్నారు. 

లీజు ఒప్పందం వివరాలు

మైక్రోసాఫ్ట్‌్ సంస్థ ఐదు సంవత్సాల లీజు ఒప్పందాన్ని టేబుల్ స్పేస్‌ టెక్నాలజీస్ అనే మేనేజ్డ్ వర్క్‌స్పేస్‌ ఆపరేటర్‌తో కుదుర్చుకుంది. లీజు 2025 జులై నుంచి ప్రారంభమైంది. ఈ ఆఫీస్‌ ఫీనిక్స్‌ సెంటారస్‌ భవనంలో మూడో, నాల్గో అంతస్తులో విస్తరించి ఉంది. 

  • ప్రాథమిక అద్దె- చదరపు అడుగుకు 67రూపాయలు చొప్పున నెలకు 1.77 కోట్లు
  • మొత్తం నెల అద్దె- 5.4 కోట్లు(చదరపు అడుగుకు రూ. 204)
  • వార్షిక పెరుగుదల-4.8 శాతం 
  • సెక్యూరిటీ డిపాజిట్‌-42.15కోట్ల రూపాయలు 
  • స్టాంప్‌ డ్యూటీ అండ్‌ రిజిస్ట్రేషన్ - రూ. 92.94 లక్షలు

మొత్తం అద్దెలో కామన్ ఏరియా మెంటెనెన్స్‌, ఆపరేటింగ్‌ ఎక్స్‌పెన్సెస్‌,క్యాపిటల్‌ ఎక్స్‌పెండించర్‌ మేనేజ్మెంట్‌ ఫీ కూడా ఉంటుంది. 

ఫీనిక్స్ సెంటారస్‌ వివరాలు 

ఫీనిక్స్ సెంటారస్‌ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్‌ ఉంది. స్టేట్ ఆఫ్‌ ధి ఆర్ట్‌ ఎస్‌ఈజెడ్‌ క్యాంపస్‌ ఇది. ఫీనిక్స్ గ్రూప్ అభివృద్ధి చేసిన ఈ టెక్ పార్క్‌ 21లక్షల చదరపు అడుగుల మొత్తం విస్తీర్ణంతో 17 అంతస్తుల భవనంగా నిర్మించారు. 

భవనంలో సౌకర్యాల సంగతి ఏంటీ?

  • ప్రతి అంతస్తు 55,000 నుంచి 69,000 చదరపు అడుగుల విస్తీర్ణ
  • ఫుడ్ కోర్టు, బిజినెస్ సెంటర్‌ రిటైల్‌ స్పేస్‌
  • క్రేచ్‌, జిమ్, సెలూన్ సౌకర్యాలు ఉన్నాయి. 
  • లేటెస్ట్ సెక్యూరిటీ ఫెసిలిటీస్ ఉన్నాయి. 
  • ఇప్పటికే ఇక్కడ ZF టెక్నాలజీ సెంటర్ ఇండియా ఉంది. ఇన్‌స్పైడర్‌ బ్రాండ్స్‌ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్‌ ఉంది. 

మైక్రోసాఫ్ట్‌ హైదరాబాద్ చరిత్ర

మైక్రోసాఫ్ట్‌ కు హైదరాబాద్‌తో సుదీర్ఘకాల అనుబంధం ఉంది. కంపెనీ 1998లో ఇండియా డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఇక్కడ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 25 ఏళ్ల పాటు ఈ నగరంతో పాటు వృద్ధి చెందుతూ వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌ మైక్రోసాఫ్ట్‌కు అమెరికా వెలుపల అతి పెద్ద R&D కేంద్రంగా మారింది. 

గచ్చిబౌలి క్యాంపస్ వరాలు 

  • మొత్తం 20వేల మందికి మించి ఉద్యోగులు పని చేయబోతున్నారు. 
  • AI, క్లౌడ్‌ ఇన్నోవేషన్, ఇంజినీరింగ్ విభాగాలు ఇక్కడ పని చేస్తాయి. 
  • 2025 ఫిబ్రవరిలో కొత్తగా 1.1 మిలియన్ చదరపు అడుగుల అదనపు సౌకర్యం ప్రారంభించారు. 
  • 2500 మంది అదనపు ఉద్యోగుల కోసం సామర్థ్యం పెంచుతారు. 

విస్తరణకు కారణాలు 

  • భారత్‌లో AI టెక్నాలజీ అభివృద్ధికి పెరుగుతున్న డిమాండ్ తోడ్పాటు అందించేందుకు 
  • హైదరాబాద్‌లోని ప్రతిభ లభ్యత, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను వాడుకోవడానికి. 
  • ప్రభుత్వ మద్దతు, ఐటీ అనుకూల విధానాలు కూడా కలిసి వచ్చింది. 

మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది

మైక్రోసాఫ్ట్‌ లీజు ఒప్పందం హైదరాబాద్‌ గ్రేడ్‌-A ఆఫీస్‌ మార్కెట్‌కు గణనీయమైన ప్రోత్సాహం లభిస్తుంది. అంతే కాకుండా ఇలాంటి సంస్థ విస్తరణ పనులు చేపట్టందో హైదరాబాద్‌ గ్లోబల్ టెక్ హోదాను మరింత బలోపేతం చేసుకుంటుంది. భవిష్యత్‌ టెక్నాలజీ లీడర్‌గా నిలబెట్టే దిశగా ఇదో కీలక అడుగుగా భావించవచ్చు.