Jagadhatri Serial Today Episode యువరాజ్, నిషిక ఇంటికి రాలేదని వైజయంతి చాలా టెన్షన్ పడుతుంది. ఏం పట్టించుకోవడం లేదని భర్తని అంటుంది. ఏం కాదులే వచ్చేస్తారులే అని కౌషికి, సుధాకర్ అంటారు. ఇంతలో జగద్ధాత్రి, కేథార్‌లు యువరాజ్, నిషికల్ని తీసుకొస్తారు.
యువరాజ్, నిషికల గాయాలు చూసి ఇంట్లో అందరూ ప్రశ్నిస్తారు. కేథార్ నేను చెప్తాను అనగానే యువరాజ్, నిషికలు భయపడతారు. కేథార్ అక్కతో నేను జగద్ధాత్రి సాక్ష్యాల కోసం జేడీ, కేడీల సాయంతో ఆదిత్యపురం వెళ్లాం.. అది తెలుసుకొని యువరాజ్, నిషికలు వచ్చారు. మాకు సాక్ష్యాలు దొరక్కుండా చేశారు. అప్పుడే వాళ్లకి ఇలా అయింది అని కేథార్ అంటాడు. కౌషికి కోపంగా వారసత్వం ఒకరు ఇస్తే వచ్చేది కాదు పొగొడితే పోయేది కాదు. కేథార్ నిజంగా సాక్ష్యాలు తీసుకొస్తే ఈ ఇంటి వారసుడు అయిపోతావని అలా చేశావ్ నీ ప్లేస్‌లో కేథార్ ఉంటే అలా చేసేవాడు కాదు అని కౌషికి అంటే యువరాజ్ స్టాపిట్ అక్క అని అంటాడు. దాంతో కౌషికి యువరాజ్‌ని లాగిపెట్టి కొడుతుంది. తీరా చూస్తే నిజం చెప్తే కౌషికి ఇలా కొడుతుంది అని జగద్ధాత్రి ఊహించుకొని యాక్సిడెంట్ అయిందని కవర్ చేస్తుంది.
నిషిక, యువరాజ్ నిజం చెప్పలేదని హ్యాపీగా ఫీలవుతారు. యాక్సిడెంటా అని అందరూ నోరెళ్లపెడతారు. ముందే చెప్పా వినలేదు మీ నాయన ఏం పట్టనట్లు ఉన్నాడని వైజయంతి అంటుంది. ఇక కౌషికి నిజంగానే యాక్సిడెంట్ అయిందా ఆ దెబ్బలు యాక్సిడెంట్ దెబ్బల్లా లేవని అంటుంది. నిజమే అని జగద్ధాత్రి అంటుంది. వైజయంతి వాళ్లని తీసుకెళ్లిపోతుంది. ఇక కౌషికి మరోసారి నిజమేనా అని కేవలం జగద్ధాత్రి, కేథార్‌లకు అడుగుతుంది. అవును యాక్సిడెంట్‌నే అని జగద్ధాత్రి అంటుంది.
వైజయంతి కొడుకు కోడల్ని తీసుకెళ్లి ఏం జరిగింది అని అడుగుతుంది. నిషిక అత్తతో ఈ రోజు నిజంగా మా టైం బాగుంది అత్తయ్య లేదంటే మేం మీకు కనిపించే వాళ్లం కాదు అని అంటుంది. వైజయంతి షాక్ అయిపోతుంది. నిషిక మొత్తం వైజయంతికి చెప్తుంది. వాళ్ల చేతిలో బతికి బయట పడ్డాను అది నాకు నచ్చలేదు అని యువరాజ్ అంటాడు.
కేథార్ బయట బాధపడుతుంటే జగద్ధాత్రి వెళ్లి ఓదార్చాలి అని ప్రయత్నిస్తుంది. వజ్రపాటి వారసుడిగా గుర్తింపు వస్తుందని ఆశ పడ్డాను కానీ ఆ ఆశ పోయింది. వజ్రపాటి వారసుడిగా తలెత్తుకొని తిరిగే అదృష్టం నాకు లేదు అని కేథార్ బాధ పడతాడు. సమస్య అందరికీ వస్తుంది పోరాడే వాడే అసలైన మనిషి అని సమస్య దగ్గరే పరిష్కారం ఉంటుందని అంటుంది. కచ్చితంగా వజ్రపాటి వారసుడుగా నీకు గుర్తింపు వస్తుందని అంటుంది.
కౌషికికి లాయర్ కాల్ చేస్తారు. మీరు హియరింగ్‌కి ఇక కోర్టుకి రావాల్సిన అవసరం లేదు మీ తమ్ముడు మరదలు తెచ్చిన సాక్ష్యాలు బలంగా ఉన్నాయని అంటారు. కేవలం ఫార్మాలిటీ కోసం రమ్మని చెప్తారు. కౌషికి చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ఇంట్లో అందరిని పిలిచి మేనేజర్ మర్డర్ కేసులో నేను నిరాపరాధి అని రుజువు అయిందని చెప్తుంది. చాలా హ్యాపీగా ఫీలవుతుంది. జగద్ధాత్రి, కేథార్‌లకు కౌషికి థ్యాంక్స్ చెప్తుంది. అక్క మనది రక్త సంబంధం అక్క తరతరాలకు ఉండిపోతుంది మీకు ఏమైనా మేం చూసుకుంటా అని అంటాడు. మిమల్ని చూస్తే చాలా గర్వంగా ఉందని సుధాకర్ అంటాడు. ఇక అందరూ వరలక్ష్మీ వ్రతం చేసుకుందామని అనుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
వినాయక చవితి పూజా విధానం - పసుపు గణపతి పూజా విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
పసుపు గణపతి పూజ తర్వాత మీరు తీసుకొచ్చిన గణేష్ విగ్రహానికి పూజ చేసే విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
వినాయక చవితి రోజు చదవాల్సిన కథలు సంస్కృతంలో కాకుండా మీకు అర్థమయ్యేలా చదువుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి