Sindhu Reddy :   74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగే రిపబ్లిక్‌ పరేడ్‌లో ఈసారి మహిళా శక్తికి విశేష ప్రాధాన్యం లభించింది. ఆర్మి, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లోనికవాతు బృందాలకు మహిళా ఆఫీసర్లు నాయకత్వం వహించారు.  గణతంత్ర దినోత్సవం నాడు మన దేశం తన సైనిక తేజాన్ని, సాంస్కృతిక సౌభ్రాతృత్వాన్ని, అంతర్గత వైవిధ్యాన్ని చాటుకుంటుంది.  పరేడ్‌లోపాల్గొనే త్రివిధ దళాల కవాతు బృందాలకు పురుష ఆఫీసర్లు నాయకత్వం వహించి ముందు నడవడం ఆనవాయితీ. ఈసారి ముగ్గురు మహిళా ఆఫీసర్లకు నాయకత్వ స్థానం దొరికింది. వారిలో ఒకరు తెలుగు ఆఫీసర్ సింధురెడ్డి. 


ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో మిగ్‌- 17 పైలెట్‌గా ఉన్న స్కాడ్రన్‌ లీడర్‌ సింధు రెడ్డి తన దళం తరఫున 144 మంది గగన యోధులతో కవాతు నిర్వహించారు  .  "నారీ శక్తి"ని ప్రోత్సహించాలనే భారత వైమానిక దళం యొక్క లక్ష్యానికి అనుగుణంగా, స్క్వాడ్రన్ లీడర్ సింధూ రెడ్డి రాజధాని నగరంలోని కర్తవ్య మార్గంలో రిపబ్లిక్ డే పరేడ్‌లో ఫోర్స్ మార్చింగ్ బృందానికి నాయకత్వం వహించారు.  12  వరుసలతో ఒక పెట్టె నిర్మాణంలో నలుగురు అధికారులు మరియు 144 మంది వైమానిక యోధులు కలిసి చేసిన కవాతు అందర్నీ ఆకర్షించింది.  కవాతు బృందంలోని వ్యక్తులు అన్ని బలగాల నుండి కఠినమైన ప్రక్రియ ద్వారా ఎంపికయ్యారు.  


స్క్వాడ్రన్ లీడర్ సింధు రెడ్డితో పాటు, ఈ బృందంలో ముగ్గురు అదనపు అధికారులు ఉంటారు.  ఫ్లైట్ లెఫ్టినెంట్లు ఆయుష్ అగర్వాల్, తనూజ్ మాలిక్ , ప్రధాన్ నిఖిల్ మిగతా వారు. వీరి బృందం IAF 2011, 2012, 2013 మరియు 2020లలో ఉత్తమ కవాతు బృందంగా అవార్డును గెలుచుకుంది.ఈ సంవత్సరం, Flt లెఫ్టినెంట్ కోమల్ రాణి, మరో మహిళా అధికారి, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కర్తవ్య మార్గంలో జాతీయ జెండాను ఎగురవేయడంలో సహాయం ;చేశారు. 2011, 2012, 2013, మరియు 2020లో, IAF ఉత్తమ మార్చింగ్ కాంటింజెంట్‌గా ట్రోఫీని గెలుచుకుంది. 2022లో, ఇది పాపులర్ ఛాయిస్ కేటగిరీలో బెస్ట్ మార్చింగ్ కంటింజెంట్‌గా అవార్డును కూడా గెలుచుకుంది.


సింధురెడ్డి స్కాడ్రన్ లీడర్‌గా మిగ్17 యుద్ధవిమానాన్ని అలవోకగా నడిపేస్తారు.తెలుగు యువతి అయిన సింధు రెడ్డి... తండ్రి ప్రోత్సాహంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోకి అడుగు పెట్టారు. సాధారణంగా ఆర్మీలో మహిళలు చేరేది తక్కువ. అదీ కూడా ఎయిర్ ఫోర్స్ లాంటి కఠినమైన దళాల్లో చేరరు. అయితే పైలట్ కోర్సుచేయడమే కాదు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో దేశానికి సేవ చేయడానికి సింధురెడ్డి ముందడుగు వేశారు. ఇప్పుడు ఆమెకు దేశ వ్యాప్త గుర్తింపు లభించింది.  


సింధురెడ్డి లాంటి వారి స్ఫూర్తితో మరింత మంది మహిళలు త్రివిద దళాల్లో సేవలు అందించడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంది. సింధురెడ్డి కూడా అదే చెబుతున్నారు. తాము దేశానికి సేవ చేయడానికి ఎయిర్ ఫోర్స్ లోకి రావాలనుకున్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డామని.. కానీ ఇప్పుడు  మాత్రం పట్టుదల ఉంటే సులువుగా ప్రవేశ దక్కించుకోవచ్చంటున్నారు.