Coast Guard Notification: 'కోస్ట్‌గార్డ్' కొలువులకు నోటిఫికేషన్ - టెన్త్, ఇంటర్ అర్హతలు!

నావిక్(జనరల్ డ్యూటీ) పోస్టులకు ఇంటర్, నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్) పోస్టులకు పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి. సరైన అర్హతలు ఉన్నవారు పురుష అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Continues below advertisement

ఇండియన్ కోస్ట్‌గార్డులో నావిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. నావిక్(జనరల్ డ్యూటీ) పోస్టులకు ఇంటర్, నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్) పోస్టులకు పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు తప్పనిసరి. సరైన అర్హతలు ఉన్న పురుష అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 6 నుంచి 16 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.

Continues below advertisement

వివరాలు..

➥ మొత్తం ఖాళీల సంఖ్య: 255

1) నావిక్(జనరల్ డ్యూటీ): 225 పోస్టులు

2) నావిక్ (డొమెస్టిక్ బ్రాంచి): 30 పోస్టులు

అర్హత: నావిక్(జనరల్ డ్యూటీ)పోస్టులకు ఇంటర్(ఎంపీసీ), నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్) పోస్టులకు పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి. పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్థుల వయసు 18 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. 01.09.2001 - 31.08.2005 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఎంపిక విధానం: స్టేజ్-1, స్టేజ్-2, స్టేజ్-3, స్టేజ్-4 పరీక్షలు, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష రుసుము: రూ.300. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ప్రారంభ వేతనం: నెలకు రూ.21,700.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 06.02.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 16.02.2023.

Notification

Online Application

Website

Also Read:

'టెన్త్' అర్హతతో కానిస్టేబుల్ పోస్టులు, 451 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి - దరఖాస్తు ప్రారంభం!
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్(డ్రైవర్), కానిస్టేబుల్స్(డ్రైవర్-కమ్-పంప్-ఆపరేటర్- ఫైర్ సర్వీస్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 451 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతి అర్హత ఉన్న పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టుల దరఖాస్తు ప్రక్రియ జనవరి 23న ప్రారంభమైంది. అభ్యర్థుల ఫిబ్రవరి 22 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700 - రూ.69,100 వేతనంగా ఇస్తారు. ఫిజికల్ పరీక్షలు, రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఇండియన్ నేవీలో ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!
ఇండియ‌న్ నేవీలో స్పెషల్ నేవల్ ఓరియంటేషన్ కోర్సు జూన్-2023 ద్వారా ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీలో షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  అవివాహిత స్త్రీ, పురుషులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జనవరి 21న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ మెరిట్ ద్వారా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్‌లో 135 మైనింగ్ సిర్దార్, సర్వేయర్ ఉద్యోగాలు, అర్హతలివే!
నాగ్‌పూర్‌లోని వెస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ (డబ్ల్యూసీఎల్‌) మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లోని డబ్ల్యూసీఎల్‌కు చెందిన భూగర్భ, ఓపెన్‌కాస్ట్ గనుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 135 మైనింగ్‌ సిర్దార్‌, సర్వేయర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. సరైన అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు సంబంధించి జనవరి 21 నంచి ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Continues below advertisement