ABP  WhatsApp

Sidhu Moose Wala Case: 'నెల రోజుల్లోగా న్యాయం కావాలి- లేకపోతే దేశం విడిచి వెళ్లిపోతా'

ABP Desam Updated at: 30 Oct 2022 06:05 PM (IST)
Edited By: Murali Krishna

Sidhu Moose Wala Case: నెల రోజుల్లోగా తన కుమారుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసును తేల్చాలని ఆయన తండ్రి డిమాండ్ చేశారు.

(Image Source: PTI)

NEXT PREV

Sidhu Moose Wala Case: పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా (Sidhu Moose Wala) హత్య కేసును నెల రోజుల్లోగా తేల్చాలని ఆయన తండ్రి బల్కౌర్ సింగ్.. ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే  దేశాన్ని విడిచి పెళ్లిపోతానని హెచ్చరించారు.







నా బిడ్డను పథకం ప్రకారం హత్య చేశారు. దీనిని గ్యాంగ్ వార్ ఘటనగా చూపించాలని పోలీసులు భావిస్తున్నారు. నా సమస్యలు వినేందుకు డీజీపీని సమయం కోరాను. నేను ఒక నెల వేచి ఉంటాను. ఏమీ జరగకపోతే, నేను నా ఎఫ్ఐఆర్ ఉపసంహరించుకుంటాను. దేశం విడిచి వెళ్లిపోతాను.                          - బాల్కౌర్ సింగ్, సిద్ధూ మూసే వాలా తండ్రి


5 నెలలు


తన కుమారుడి హత్య జరిగి 5 నెలలు కావస్తున్నా ఇంతవరకు తనకు న్యాయం జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు చట్టంపై నమ్మకం ఉందని, అందుకే ఇంతవరకు ఎదురుచూసినట్లు ఆయన తెలిపారు.



చట్టంపై నమ్మకం ఉంది కనుకే ఇప్పటివరకు ఎలాంటి ధర్నాలు చేయలేదు. అయినా ప్రభుత్వంలో చలనం లేకపోవడం నాకు కోపం తెప్పిస్తుంది. నా కొడుకును చంపిన కేసులో ఇన్ని రోజులైనా న్యాయం జరుగకపోవడం నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది.                                                        -    బాల్కౌర్ సింగ్, సిద్ధూ మూసేవాలా తండ్రి


ఇదీ జరిగింది


సిద్ధూ మూసేవాలా (Sidhu Moose Wala) ఇద్దరు స్నేహితులతో కలిసి మే 29న మాన్సా జిల్లాలోని గ్రామానికి వెళ్తుండగా మార్గ మధ్యలో గుర్తుతెలియని వ్యక్తులు ఆయన్ను తుపాకీతో కాల్చిచంపారు. ఈ ఘటనలో మిగతా ఇద్దరికీ గాయాలయ్యాయి. వీఐపీ సంస్కృతికి తెరదించుతూ రాష్ట్రంలోని ప్రముఖులకు కేటాయించిన పోలీసు భద్రతను ప్రభుత్వం ఉపసంహరించిన మరుసటి రోజే ఈ ఘటన జరిగింది.


Also Read: Vladimir Putin: 'ఉక్రెయిన్- రష్యా యుద్ధం అయ్యేసరికి పుతిన్ కథ ముగిసిపోతుంది'

Published at: 30 Oct 2022 06:00 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.