Shraddha Murder Case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న అఫ్తాబ్ అమీన్ పూనావాలాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హెడ్‌క్వార్టర్స్‌కు పోలీసులు తీసుకువెళ్లారు, ఈ కేసుకు సంబంధించి వాయిస్ శాంప్లింగ్ పరీక్ష కోసం ఇక్కడకు తీసుకువచ్చినట్లు వార్తా సంస్థ ANI తెలిపింది.
నిందితుడు అఫ్తాబ్.. శ్రద్ధాతో గొడవపడుతోన్న ఓ ఆడియో క్లిప్ దిల్లీ పోలీసులకు దొరికింది. అనంతరం దిల్లీ కోర్టు ఆదేశాల మేరకు వాయిస్ శాంప్లింగ్ పరీక్షలు నిర్వహించినట్లు ఎన్‌డీటీవీ వెల్లడించింది. పోలీసులు.. ఈ ఆడియో క్లిప్‌ను "పెద్ద సాక్ష్యం"గా పరిగణిస్తున్నారు. కోల్డ్ బ్లడెడ్ హత్య వెనుక ఉద్దేశాన్ని ఈ క్లిప్ తెలియజేస్తుందని సమాచారం.
బెయిల్ వద్దు
తనకు బెయిల్ మంజూరు చేయాలని వేసిన పిటిషన్‌ను అఫ్తాబ్ ఉపసంహరించుకున్నాడు. అఫ్తాబ్‌యే బెయిల్ వద్దని చెప్పడంతో దిల్లీ సాకేత్ కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరైన అఫ్తాబ్ తాను డిసెంబరు 15న కోర్టులో వేసిన తన బెయిల్ అభ్యర్థనను ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నానని తెలిపాడు. దీనిపై శ్రద్ధా తండ్రి తరపున వాదిస్తున్న న్యాయవాది సీమా కుష్సహా మాట్లాడారు.
ఈ హత్య కేసులో నవంబరు 12న అరెస్ట్ అయిన అఫ్తాబ్ ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నాడు. కోర్టు డిసెంబరు 9న అఫ్తాబ్ కస్టడీ 14 రోజులు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
పోలీస్ విచారణ
ఈ కేసు దర్యాప్తులో పురోగతి గురించి స్పెషల్ పోలీస్ కమిషనర్ సాగర్ ప్రీత్ హూడా మాట్లాడారు.
Also Read: US Weather-Related Deaths: అమెరికాలో మంచు తుపాను బీభత్సం- 31 మంది మృతి!