ABP  WhatsApp

Shivaji Remarks Row: 'మా దేవుడయ్యా శివాజీ'- రంగంలోకి దిగిన నితిన్ గడ్కరీ!

ABP Desam Updated at: 22 Nov 2022 11:19 AM (IST)
Edited By: Murali Krishna

Shivaji Remarks Row: శివాజీ మహారాజ్‌పై మహారాష్ట్ర గవర్నర్ చేసిన వ్యాఖ్యల మంటలను ఆర్పేందుకు గడ్కరీ ప్రయత్నిస్తున్నారు.

'మా దేవుడయ్యా శివాజీ'- రంగంలోకి దిగిన నితిన్ గడ్కరీ!

NEXT PREV

Shivaji Remarks Row: ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి మహారాష్ట్ర గవర్నర్ బీఎస్ కోష్యారీ చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. ఈ వ్యాఖ్యల కారణంగా ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలోని శివసేన వర్గానికి భాజపాకు మధ్య మాటల మంటలు అంటుకున్నాయి. వీటిని ఆర్పేందుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ రంగ ప్రవేశం చేశారు. మరాఠీలో ఆయన ఓ ట్వీట్ చేశారు.


మా దేవుడు!







ఛత్రపతి శివాజీ మహారాజ్ మా దేవుడు. ఆయనను మా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా గౌరవిస్తాం.                                          - నితిన్ గడ్కరీ, కేంద్రమంత్రి


గవర్నర్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ముంబయి సహా ఇతర నగరాల్లో శివసేనకు చెందిన ఉద్ధవ్ ఠాక్రే శిబిరం, కాంగ్రెస్, ఎన్‌సీపీ భారీ నిరసనల చేపడుతున్నాయి. శివాజీని అవమానించిన వ్యక్తికి మహారాష్ట్రలో చోటు లేదని తేల్చి చెబుతున్నాయి.


శిందే వర్గం నుంచి


సీఎం ఏక్‌నాథ్ శిందే వర్గం నుంచి కూడా గవర్నర్‌పై విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ తాజాగా గవర్నర్‌ను విమర్శించారు.



గవర్నర్ భగవత్ సింగ్ కోష్యారీని రాష్ట్రం నుంచి ఎక్కడికైనా దూరంగా పంపేయాల్సిందే. మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన శివాజీపై అలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం మేం సహించం. గతంలోనూ ఇలాంటి కామెంట్స్ చేసి ఆయన విమర్శల పాలయ్యారు. ఛత్రపజి శివాజీ సిద్ధాంతాల్ని గవర్నర్ అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో మరే వ్యక్తితోనూ ఆయనను పోల్చలేం. కేంద్రంలోని భాజపా నేతలకు నాదో విన్నపం. రాష్ట్ర చరిత్ర గురించి తెలియని ఇలాంటి వ్యక్తిని వేరే ఎక్కడికైనా పంపడం మంచిది..                                      - సంజయ్ గైక్వాడ్, ఎమ్మెల్యే


గవర్నర్


ఛత్రపతి శివాజీ ఐకానిక్ పర్సనాలిటీ అయినా అదంతా పాత రోజుల్లోనని...ఇప్పటి ఐకానిక్ పర్సనాలిటీస్ వేరే ఉన్నారని గవర్నర్ ఇటీవల అన్నారు. ఔరంగాబాద్‌ లోని డాక్టర్ బాబాసాహెబ్ అండేక్కర్ యూనివర్సిటీలో ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఆ సమయంలోనే ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.



ఒకప్పుడు భారత్‌లో ఐకాన్‌ లాంటి వ్యక్తులెవరంటే నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ అని సమాధానం ఇచ్చేవారు. కానీ...మహారాష్ట్ర ఈ విషయంలో ప్రత్యేకం. ఇక్కడ ఎంతో మంది గొప్ప వ్యక్తులున్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ ఒకప్పటి ఐకాన్. కానీ ఇప్పుడు అంబేడ్కర్‌, నితిన్ గడ్కరీ ఆ స్థాయిలో ఉన్నారు.                                               -   బీఎస్ కోష్యారీ, మహారాష్ట్ర గవర్నర్


Also Read: Satyendar Jain: 'ఆ వీడియోలో ఉన్నది ఫిజియోథెరపిస్ట్ కాదు రేపిస్ట్'

Published at: 22 Nov 2022 11:06 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.