నేడు సిట్ ముందుకు మరోసారి విచారణకు అడ్వకేట్ శ్రీనివాస్
సిట్ ముందుకి విచారణకు మరోసారి హాజరుకానున్నారు అడ్వకేట్ శ్రీనివాస్. ఆయన ఇచ్చిన సమాచారంతో తెలంగాణ బీజేపీ కీలక నేతలకు నోటీసులు ఇవ్వనున్న సిట్. నిన్న విచారణకు హాజరుకాని BJP ప్రధాన కార్యదర్శి బి ఎల్ సంతోష్, తుషార్, జగ్గు స్వామిపై లీగల్‌గా వెళ్లాలని సిట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
నేటితో ముగియనున్న బీజేపీ శిక్షణాశిబిరం
ప్రధాన రాజకీయ పార్టీలు 2023 ఎన్నికలే లక్ష్యంగా కార్యాచరణను మొదలుపెట్టేశారు. ఎన్నికల బాణాలు సిద్ధం చేసుకుంటున్నారు. బీజేపీ కూడా ఇదే పనిలో నిమగ్నమైంది. ఇందులో భాగంగానే ఈనెల 20 నుంచి బీజేపీ శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. నేడు కూడా జరగనున్నాయి. నేడు చివరి రోజు కావడంతో పార్టీ కార్యవర్గ సమావేశం కానుంది. ఇందులో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. ఎన్నికలకు సంబంధించిన యాక్షన్ ప్లాన్‌ను రోడ్ మ్యాప్‌ను తయారు చేయనున్నారు. ఇంతలోనే పార్టీ పెద్దలకు ఇంఛార్జీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానికంగా ఉండే తమకి ఎక్కడో మారుమూల జిల్లాలకు ఇంఛార్జీలుగా ఎలా వేస్తారని ప్రశ్నిస్తున్నారు. తమ జిల్లాకు కేటాయిస్తే స్థానికంగా ఉంటూ తాము పోటీ చేయాలనుకునే నియోజకవర్గంలో పార్టీ బలాన్ని పెంచుకుంటామని బీజేపీ నేతలు అంతర్మథనంలో పడిపోయారు. నేటి బీజేపీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇవాళ్టి నుంచి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ కోర్సుల్లో ప్రవేశాలు.
తెలంగాణలోని కాళోజీ యూనివర్శిటీ ఈ రోజునుంచి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ కోర్సుల్లో కన్వీనర్ కోటాల సీట్ల భర్తీకి ప్రవేశాల ప్రక్రియ నిర్వహించనుంది. ఈ రోజు నుంచి ఈ నెల 25 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకూ అర్హులైన అభ్యర్థులు ఆఫ్షన్లు నమోదు చేసుకోవాలని కాళోజీ హెల్త్ యూనివర్శిటీ అధికారులు పేర్కొన్నారు.
సద్దుమణిగిన మార్కెట్‌లో గన్ని బ్యాగుల వివాదం
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గన్ని బ్యాగుల ధర చెల్లింపు విషయంలో ఏర్పడిన వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. పంట ఉత్పత్తులు తెచ్చే గన్నీ బ్యాగులకు రూ.30 చొప్పున చెల్లించాలని ఉన్నతాధికారులు ఆదేశించగా, వ్యా పారులు అందుకు నిరాకరించడమే కాకుండా నిన్నటి నుంచి పంట ఉత్పత్తుల కొనుగోళ్లు బంద్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో మార్కెట్‌లోని పత్తి, మిర్చి యార్డులు ఎవ్వరు కనిపించలేదు. మంత్రి దయాకర్‌రావు చొరవ తీసుకొని తన క్యాంపు కార్యాలయంలో చాంబర్ ప్రతినిధులు, అధికారులు, రైతు సం ఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. గన్నీ బ్యాగుల నాణ్యత, ధరపై అధ్యయనం చేసేందుకు ఇద్దరు రైతులు, ఇద్దరు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, ఇద్దరు అధికారులతో కమిటీ వేసి అధ్యయనం చేయిస్తామని ప్రకటించారు. దీంతో వ్యాపారులు సానుకూలంగా స్పందించారు. గన్నీ బ్యాగులకు రూ.30 చొప్పున చెల్లించేందుకు అంగీకరించడమే కాకుండా, నేటి నుంచి మార్కెట్‌లో క్రయవిక్రయాలు ప్రారంభం కానున్నాయి. మార్కెట్ మొత్తం ఉదయం తెల్ల బంగారంతో నిండిపోయింది. నిన్న మార్కెట్ కు వచ్చిన రైతులు ఇబ్బందులు పడ్డారు.. నేడు క్రయవిక్రయాలు ప్రారంభం కాగానే రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వాయు గుండం ప్రభావం ఉత్తర తెలంగాణపై ఎఫెక్ట్
వాయుగుండం వణికిస్తోంది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. ఉదయం నుంచి వాతావరణం కూల్‌గా మారడంతో పాటు చలి తీవ్రత ఎక్కువైంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాలో వర్ష సూచన ఉన్న నేపథ్యంలో రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచనలు చేశారు రైతులు ఆరబోసుకున్న ధాన్యం తడిచే అవకాశం ఉండడంతో జాగ్రత్త పడాలని వారు సూచించారు వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో ఇప్పటికే కురుస్తున్న వర్షం కురుస్తున్న పరిస్థితి ఉంది.
భూపాలపల్లి జిల్లాలో కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర
భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తు రైతులు ఎదుర్కొంటున్నా సమస్యలను అడిగి తెలుసుకుంటూ సాగుతోంది పాదయాత్ర.