Former Bangladesh PMs Return :  మాజీ ప్రధాని షేర్ హసీనా బంగ్లాదేశ్‌కు తిరిగి రావాలనుకుటే ఖచ్చితంగా ఆమె నోరు తెరవకూడదని తాత్కాలిక ప్రభుత్వ సారధి మహమ్మద్ యూనస్ స్పష్టం  చేశారు. ఢిల్లీలో కూర్చుని ఆమె ప్రకటనలు చేయడానికి భారత ప్రభుత్వం అంగీకరించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె ఎలాంటి ప్రకటనలు చేయకుండా చూడాల్సిన బాద్యత భారత ప్రభుత్వానిదేనన్నారు. షేక్ హసీనా లేకపోతే బంగ్లాదేశ్ మరో ఆప్ఘాన్ అవుతుందని ప్రచారం చేస్తున్నాయని.. ఆయన అసహనం  వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు పదమూడో తేదీన షేక్ హసీనా ఓ ప్రకటన చేశారు. తనకు అన్యాయం జరిగిందని తిరుగుబాటు జరిగినప్పుడు జరిగిన ఘటనలపై న్యాయవిచారణ చేయించాలని ఆమె డిమాండ్ చేశారు. షేక్ హసీనా ప్రకటన బంగ్లాదేశ్‌లో కలకలం రేపింది.  


భారత్‌లోనే ఉంటున్న షేక్ హసీనా   


ప్రస్తుతం షేక్ హసీనా  భారత్‌లోనే ఆశ్రయం పొందుతున్నారు. ఆమె యూకే లేదా మరో ప్రాంతానికి వెళ్తారని అనుకున్నా.. ఇప్పటికీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. యూకే రాజకీయ ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించింది. ఈ కారణంతో ఆమె మరో ఆప్షన్ లేకపోవడంతో ఢిల్లీలోనే ఉండిపోతున్నారు. ఆమె బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న సమయం నుంచి భారత్ తో సత్సంబంధాలు ఉన్నాయి. అయితే భారత్ వ్యక్తులతో కాదని.. దేశాలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకోవాలని యూనస్ అంటున్నారు. భారత్ తో ఉన్న మంచి సంబంధాలను కొనసాగించాలని అనుకుంటున్నామని ఇప్పుడు షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చి ఇలాంటి ప్రకటనలు చేసే అవకాశం ఇవ్వడం ఫ్రెడ్లీ గెశ్చర్ కాదని ఆయనంటున్నారు. 


బంగ్లాదేశ్ రాజకీయాల్లో సంచలనం, షేక్ హసీనాతో పాటు మరో ఆరుగురిపై హత్య కేసు


భారత్ ఆశ్రయం ఇవ్వడంపై అసంతృప్తిలో యూనస్ 


షేక్ హసీనా బంగ్లాదేశ్‌క తిరిగి రావాలనుకుంటే.. ఆమె ఖచ్చితంగా సైలెంట్ గా ఉండాలన్నదే కండిషన్ అని మహమ్మద్ యూనస్ పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో చెప్పారు. షేక్ హసీనా విషయంలో భారత్ విధానం చాలా అసౌకర్యంగా ఉందని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరగడం లేదని..  షేక్ హరీనా పార్టీకి చెందిన కొంత మంది నేతలు హిందువులు కాబట్టి.. వారిపై దాడులు జరిగాయన్నారు. అందలో మత కోణం లేదని స్పష్టం చేశారు. రాజకీయ ఘర్షణల్లో వారు గాయపడ్డారని స్పష్టం చేశారు. 


మోదీకి బంగ్లాదేశ్ ప్రధాని ఫోన్‌కాల్, హిందువులకు భద్రత కల్పిస్తామని భరోసా


భారత్‌తో మంచి సంబంధాలు కొనసాగించాలనుకుంటున్నామన్న యూనస్                  


ఎన్నికల్లో అక్రమాలు చేస్తూ గెలుస్తూ వచ్చారని ప్రజల్లో ఆమెపై తీవ్ర అసంతృప్తి ఉందని మహమ్మద్ యూనస్ ఇంతకు ముందు ఏబీపీకి ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. భారత్‌‌తో బంగ్లాదేశ్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని.. వాటిని కొనసాగించాలనుకుంటున్నామని ఆయన అంటున్నారు. అయితే షేక్ హసీనా విషయంలో కఠినంగా ఉండాలని ఆయన వాదన. షేక్ హసీనా రాజీనామా బంగ్లా దేశ్ నుంచి పారిపోయిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వానికి యూనస్ నేతృత్వం వహిస్తున్నారు.