Shashi Tharoor on NEW GST Rates: 


ఈ జోక్ ఎవరు క్రియేట్ చేశారో కానీ భలే ఉంది: శశిథరూర్‌ 


పాలు, పాల ఉత్పత్తులపై జీఎస్‌టీ విధించటంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదేం బాదుడు అంటూ నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఫన్నీ మీమ్స్‌ షేర్ చేస్తూ...ఈ నిర్ణయంపై సెటైర్లు వేస్తున్నారు. ఇలాగే ఓ పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పనీర్‌పై 5% జీఎస్‌టీ, బటర్‌పై 12% జీఎస్‌టీ, మసాలాపై 5% జీఎస్‌టీ వేస్తున్నారు. మరి పనీర్ బటర్ మసాలాపై ఎంత జీఎస్‌టీ వేస్తారో లెక్కించి చెప్పండి..? అనే పోస్ట్‌ రెండ్రోజులుగా షేర్ అవుతోంది. "ఈ మ్యాథ్స్ క్వశ్చన్‌కి ఆన్సర్‌ చెప్పండి" అంటూ అడుగుతున్నారు. ఈ ఫోటోని కొందరు కాంగ్రెస్ నేతలు కూడా ట్విటర్‌లో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంపీ శశిథరూర్‌ ఈ మీమ్‌పై స్పందించారు. "ఇలాంటి వాట్సాప్‌ ఫార్వర్డ్‌ మెసేజ్‌లు ఎవరు క్రియేట్ చేస్తారో తెలియదు. కానీ...జీఎస్‌టీపై వచ్చిన జోక్స్‌లో ఇదే బెస్ట్ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. కొందరు కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్‌గా, శశిథరూర్‌కి కౌంటర్ ఇస్తుంటే...ఇంకొందరు శశిథరూర్‌కి సపోర్ట్‌ ఇస్తూ ట్వీట్ చేస్తున్నారు.









 


ప్యాకేజ్డ్‌ కాకపోతే జీఎస్‌టీ ఉండదు: కేంద్రం


దాదాపు రెండు, మూడు రోజులుగా పనీర్ బటర్ మసాలా ట్రెండింగ్‌లో ఉంది. నిత్యావసర సరుకులను ప్యాకేజ్డ్‌ రూపంలో విక్రయిస్తే వాటిపై 5% జీఎస్‌టీ విధిస్తామని ఇటీవలే కేంద్రం ప్రకటించింది. ప్యాకేజ్డ్‌ పనీర్, కర్డ్, మసాలా లాంటివి ఈ పరిధిలో ఉన్నాయి. అప్పటి నుంచిరాజకీయంగా ఈ అంశంపై రచ్చ జరుగుతూనే ఉంది. అయితే కేంద్రం మాత్రం దీనిపై వివరణ ఇస్తోంది. పనీర్ బటర్ మసాలానే ఉదాహరణగా చెబుతూ...ఈ వంటకాన్ని ఏసీ రెస్టారెంట్‌లో తిన్నారా, లేదంటే నాన్ ఏసీ రెస్టారెంట్‌లో అనే దానిపై జీఎస్‌టీ ఎంత అనేది నిర్ణయిస్తారని చెబుతోంది. ఒకవేళ అది ప్యాకేజ్డ్‌ ఐటమ్ కాకపోతే, జీఎస్‌టీ వర్తించదు.  


Also Read: Indian Railway: రైలు ప్రయాణికులకు శుభవార్త, ఈ మార్గాల్లో రైళ్ల పునరుద్ధరణ!