ఫాంటసీ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ఎంతో మంది ఫేవరేట్ షో. అందులో డేనేరిస్ టార్గారియన్ పాత్రలో నటిస్తోంది ఎమీలియా క్లార్క్. గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసిన వారందరికీ ఈమె పరిచయస్థురాలే. ఆమె నటనకు ముగ్ధలయ్యే వాళ్లు ఎంతోమంది. అందంగా, అన్ని విషయాల్లో పర్‌ఫెక్ట్ కనిపిస్తుంది ఈ యువతి. నిజానికి ఆమె జీవితంలో చాలా విషాదం దాగుంది. ఇప్పటికీ ఎమిలియా మెదడులో కొంతభాగం పనిచేయదు. మిగతా భాగం మెదడుతోన ఆమె తన జీవితాన్ని కొనసాగిస్తోంది. అంతే కాదు సినిమాలు చేస్తోంది.ఇలా మెదడులో కొంతభాగం పనిచేయకుండా పోవడానికి కారణం ‘బ్రెయిన్ అనూరిజం’. 2011లో ఒకసారి, 2013లో ఒకసారి ఆమె బ్రెయిన్ అనూరిజం సమస్యలకు గురైంది. దీన్ని బ్రె యిన్ స్ట్రోక్ అని పిలుచుకోవచ్చు . ఆ రెండు సార్లు చావు అంచుల దాకా వెళ్లి బయటికి వచ్చింది. చాలా వాంతులు, స్పృహ కోల్పోవడం జరిగేదని, వైద్యునికి దగ్గరికి వెళ్లాకే తనకున్న ప్రాణాంతక సమస్య గురించి తెలిసిందని చెబుతోంది ఎమీలియా. 


సమస్య లేదా...
మెదడులో కొంత భాగం పనిచేయకపోవడం వల్ల సమస్యలు రావా? అని అడిగితే ఎందుకు రావు, కచ్చితంగా వస్తాయి. అప్పుడప్పుడు మాటల్లో స్పష్టత రాదు, కొన్ని పనులు ఇతరుల్లా నేను చేయలేను. కానీ నా వరకు నేను సంతోషంగా ఉన్నాను అని వివరిస్తోంది. 


ఏంటి బ్రెయిన్ అనూరిజం?
అనూరిజం అనేది మెదడు రక్తనాళాలైనా ధమనులు ఉబ్బి బుడగలా ఏర్పడతాయి. రక్తనాళంలో ఏ మూలైనా ఇది ఏర్పడవచ్చు. ముఖ్యంగా రక్తనాళాలు శాఖలుగా విడిపోయిన చోట వచ్చే అవకాశం ఉంది. బెలూన్లలా ఉబ్బడాన్నే అనూరిజం అంటారు. ఇవి చాలా చిన్నవిగానే ఉన్నా సమస్య మాత్రం పెద్దదనే చెప్పాలి. ఎంతో ప్రమాదకరమైనవి కూడా. బెలూన్లలా ఉబ్బిన తరువాత అవి పేలి అంతర్గం రక్తస్రావం జరిగే అవకాశం ఉంది. ఎమీలియాకు అంతర్గత రక్తస్రావం కూడా జరిగింది. ఈ ఆరోగ్యపరిస్థితి వచ్చినవారిలో బతికి బట్టకట్టేవారి సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. మూడింట మందిలో ఒక వంతు మంది మాత్రమే కోలుకుంటారు. 


లక్షణాలు..
మెదడు రక్త నాళాలో అనూరిజం మొదలైనా కూడా బయటికి కనిపించదు. కానీ కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. 


1. తీవ్రమైన తలనొప్పి
2. అప్పుడప్పుడు వచ్చి పోయే తలనొప్పులు
3. వాంతులు
4. పక్షవాతం
6. స్పృహ కోల్పోవడం 
7. చూపుకు ఎదురుగా ఉన్న వస్తువులు రెండుగా కనిపించడం
8. కళ్ల వెనుక నొప్పి


ఎందుకొస్తుంది?
బ్రెయిన్ అనూరిజం ఏర్పడటానికి సరైన కారణాలంటూ లేవు. వందమందిలో ఒకరికి వచ్చే అవకాశం ఉంది. ధూమపానం చేసేవారికిలో, అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారిలో, ముఖ్యంగా మహిళల్లో, నలభై ఏళ్లు దాటిన వారిలో ఇది వచ్చే అవకాశాలు ఎక్కువ. కొన్నిసార్లు ‘కనెక్టివ్ టిష్యూ డిజార్డర్’ సమస్య ఉన్నవారిలో కూడా  బ్రెయిన్ అనూరిజం వచ్చే అవాకాశాలు ఉన్నాయి. 


Also read: మొటిమలతో విసిగిపోయారా? ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే ఇట్టే తగ్గిపోతాయి


Also read: ఎబోలా వైరస్‌లాగే మార్బర్గ్ కూడా ప్రాణాంతకమే, గబ్బిలాల ద్వారానే వైరస్ వ్యాప్తి