గుప్పెడంతమనసు జులై 21 గురువారం ఎపిసోడ్ (Guppedantha Manasu July 21 Episode 508)
రిషిని ఇంటికి పిలిచిన సాక్షి ఆ ఆనందంలో ఉండగా..గౌతమ్, జగతి, మహేంద్ర, వసుధార కూడా రావడంతో డిస్సప్పాయింట్ అవుతుంది. బయటి నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టి అడ్డంగా దొరికి పోతుంది సాక్షి. వసు నువ్వే మేనేజ్ చేయి అని జగతి చెప్పడంతో వంటగదిలోకి వెళుతుంది వసుధార.ఆ వెనుకే వెళ్లిన గౌతమ్ కాసేపటి తర్వాత బయటకు వచ్చి వంట చేయడం అస్సలు సాధ్యంకాని పని అని చెబుతాడు. దీంతో తనకు అవకాశం దొరికిందని సాక్షి చెలరేగిపోతుంది. నాకన్నా గొప్ప అనిపించుకోవడం కోసం చాలా ప్రయత్నం చేసినట్టున్నావ్..ఇప్పుడు చెప్పు ఏం ఆర్డర్ పెట్టాలో అని అడుగుతుంది. వసు-గౌతమ్ ఒకర్నొకరు చూసుకుని నవ్వుకుంటారు.
గౌతమ్: అరేయ్ నువ్వు చెబితే నమ్మలేవు కానీ వసుధార సూపర్ అంటూ... అన్నం, పప్పు, ఫ్రై, మజ్జిగ పులుసు చేసిందని చెబుతాడు
రిషి: ఇంత తక్కువ టైమ్ లో ఇంతమంచి మెనూ ఎవ్వరూ పెట్టలేరు తెలుసా అంటాడు రిషి...
వంటలు బావున్నాయని పొగుడుతూ తింటారు. సాక్షి మాత్రం నా ఇంట్ల దీని పెత్తనం ఏంటో అని రగిలిపోతుంటుంది.
రిషి: కొందరు సమస్య రాగానే టెన్షన్ పడతారు కానీ వసుధార లాంటివాళ్లు సమస్యని పరిష్కరిస్తారు. వసుధార నువ్వు గ్రేట్ అంటాడు. కూర్చో సాక్షి అని చెప్పి వసుధార వడ్డించు అంటాడు.
సాక్షి: నా ఖర్మ కాకపోతే నా ఇంట్లోకి వచ్చి వంట చేసి నాకే వడ్డిస్తోంది అనుకుంటుంది. ఈ మాత్రం నేనే చేయగలిగేదాన్ని కానీ ఇవన్నీ నువ్వు తింటావో లేదో అనుకున్నాను
రిషి: అసలు నాకు ఇష్టమైనవి ఇవే సాక్షి.. వీటికన్నా మించిన కాంబినేషన్ ఏముంటుంది చెప్పు..
సాక్షి: ఏవో నాలుగు వంటలు చేసి గొప్పపని చేశావ్ అనుకుంటున్నావా.. నా పరువు తీశావ్
వసు: నిజానికి నేను నీకు హెల్ప్ చేశాను..అర్థం చేసుకుని ఉంటే నాకు థ్యాంక్స్ చెప్పేదానివి
మొత్తానికి సాక్షిగారింట్లో అందరం భోజనం చేస్తున్నాం అని గౌతమ్ అంటాడు..
థ్యాంక్యూ సాక్షి తృప్తిగా భోజనం చేశాం అని మహేంద్ర అంటే..థ్యాంక్స్ వసుకి చెప్పాలి అంటాడు గౌతమ్..
ఇప్పుడు చదువుల పండుగ గురించి చర్చిద్దాం అని గౌతమ్ అంటే లేటైంది వెళదాం పద అంటాడు రిషి...
వసుధారని ఎవరు డ్రాప్ చేస్తారని మహేంద్ర అంటే..నేను డ్రాప్ చేస్తానంటాడు రిషి.... బై సాక్షి అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతారంతా..
Also Read: హుండీలో శౌర్య వేసిన చీటీ తీసి చదివి షాక్ అయిన హిమ, రౌడీ బేబీని గెలిపించే పనిలో ప్రేమ్
కార్లో వెళుతుంటారు రిషి-వసు
వసు:సార్..సాక్షి మీద మీ అభిప్రాయం ఏంటి సార్
రిషి: షాక్ అయి కారు ఆపేసిన రిషి..ఏమన్నావ్ మళ్లీ అను
వసు: సాక్షిమీద మీ అభిప్రాయ ఏంటని అడిగాను...తను ఏం చెప్పినా ఊ అంటున్నారు..మీరు మారిపోతున్నారు సార్.. నాకు అర్థం అవుతోంది
రిషి: తనమీద నాకు అభిప్రాయం ఏముంటుంది.. సినిమాకు వెళతానో వెళ్లనో నా ఇష్టం.. డిన్నర్ కి రమ్మంటే అందర్నీ తీసుకునే వెళ్లాను కదా..నీ ప్రాబ్లెమ్ ఏంటి
వసు: తనకు అనవసరంగా లేనిపోని ప్రాధాన్యత ఇస్తున్నారు. లైబ్రరీలో అంతలా మాట్లాడింది..అలా బ్లాక్ మెయిల్ చేయాలని చూసినా కూడా తనని ఏం జరగనట్టు ఎందుకలా చూస్తున్నారు.
రిషి: చావు అంచుల వరకూ వెళ్లొచ్చింది తనని చూసి కోపం తెచ్చుకోకు అన్న పెద్దమ్మ మాటలు గుర్తుచేసుకుంటాడు. నా విషయంలో స్పష్టత ఉందికానీ నీ సంగతేంటి.. నేను ల్యాబ్ లో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడిన మాట్లేంటి ( మిమ్మల్ని రక్షించుకోలేని ప్రాణాలు ఉంటే ఎంత పోతే ఎంత), నా మెడలో దండ ఎందుకు వేశావ్... అసలు నువ్వేం చేస్తున్నావో తెలుస్తోందా.. ఓ అమ్మాయి మెడలో దండ వేస్తే ఏమనుకోవాలి..బోర్డుమీద నెమలీక బొమ్మేంటి...దానికున్న చెయ్యేంటి.. ఆన్సర్ చెప్పు వసుధారా
వసు: నేను..మిమ్మల్ని.. ప్రేమిస్తున్నాను అని చెప్పేలోగా...
రిషి: గౌరవిస్తున్నాను అంటావ్..నీ ఆలోచనలేంటో నాకు తెలుసు చెప్పాలా.. కాలేజీ ల్యాబ్ లో ఏమవుతుందో అని టెన్షన్ పడ్డావ్, అభినందన సభలో ఎగ్జైట్ అయి దండ వేశావ్..బోర్డుపై జ్ఞాపకంలా బొమ్మ వేశావ్...
వసు: నేను చెప్పబోయేది అదికాదు..నా మనసులో మాట వినండి
రిషి: వసుధార నువ్వేం చెప్పకు..నేను చెప్పేది నిజం కాదని అనకు...నేను నమ్మను. చాలా విషయాల్లో నువ్వు క్లారిటీగా ఉంటావ్ నాకు తెలుసు
వసు: నేను దండ వేసింది టెన్షన్ పడి కాదు..నేను ఇప్పుడు నా మనసులో మాట చెప్పినా మీరు నమ్మేలా లేరు
రిషి: సాక్షి గురించి ఎక్కువ ఆలోచించకు ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో నాకు తెలియదా.. కానీ నీకోమాట చెప్పాలి.. ముద్దపప్పు, ఆలు ఫ్రై, మజ్జిగ చారు సూపర్..చాలా బాగా చేశావ్...వెళదామా..
Also Read: ఎట్టకేలకు రిషికి 'ఐ లవ్ యూ' చెప్పేసిన వసుధార, సాక్షిని ఆడేసుకున్న గౌతమ్
కాలేజీలో చదువుల పండుగ గురించి నోటీస్ బోర్డులో పెడతారు. ఆ తర్వాత క్లాస్ రూమ్ లో కూర్చున్న వసుని ప్రత్యేకంగా పొగిడేస్తుంది పుష్ప. ఎవ్వరూ ఎందులో గొప్పాకాదు..మన జీవితం మనకు అన్నీ నేర్పిస్తుంది. అప్పుడే వచ్చిన గౌతమ్.. నువ్వు సూపర్ వసుధార నీకు ఇన్ని విద్యలు ఎలా వచ్చు అంటాడు. టీం పేర్లు పెట్టావ్ చూడు సూపర్ అంటాడు.
గౌతమ్: రిషి టీమ్ లో వాడికి అసిస్టెంట్ గా నువ్వొండొచ్చు కదా
వసు: అది మనం ఎలా డిసైడ్ చేస్తాం..రిషి సార్ ఇష్టం కదా..
గౌతమ్: నేను కొంచెం ఖాళీగా ఉన్నాను..ఏదైనా పని చెప్పొచ్చు కదా
వసు:బ్యానర్స్ డిజైన్ ఫైనల్ చేసి రిషి సార్ కి మెయిల్ పెట్టండి..
గౌతమ్: నేను ఆపని చూసుకుని మీటింగ్ హాల్ కి వచ్చేస్తాను..
బ్యాడ్జెట్స్ చేయడం నేర్పించిన వసుధార..పుష్పతో ఇలా అందరితోనూ తయారు చేయించు అని చెబుతుంది. రిషి సార్ టీమ్ కి అసిస్టెంట్ గా నేను పనికిరానా..కొంపతీసి సాక్షిని అసిస్టెంట్ గా తీసుకుంటారా అనుకుంటూ.. నేను రిషి సార్ కి టీమ్ అసిస్టెంట్ గా పనికిరానా పుష్ప అని అడుగుతుంది.. ఇంతలో రిషి అక్కడకు రావడంతో సైలెంట్ గా ఉండిపోతుంది పుష్ప..
వసు: నేను రిషి సార్ టీమ్ కి అసిస్టెంట్ గా స్టూట్ అవుతాను కదా..ఏంటి పుష్ప ఏదో పులిని చూసినట్టు అలా భయపడుతున్నావేంటి అంటూ అప్పుడే రిషిని చూస్తుంది వసుధార. ఏదో మాటవరసకి...
రిషి: చదువుల పండుగ మొత్తం కరెక్ట్ గా ప్లాన్ చేయాలి, టీమ్ లీడర్స్ , అసిస్టెంట్ గొడవలు పక్కనపెట్టి నువ్వు చేసే వర్క్ నువ్వు చేయి వసుధార అంటాడు. ఇంతలో పుష్ప ఫోన్ రింగవడంతో వెళ్లమని సైగ చేస్తాడు రిషి. పుష్ప వెళ్లగానే గులాబీ పువ్వు తీసి వసుధారకి ఇస్తాడు...
ఎపిసోడ్ ముగిసింది..
Also Read: మనసు తెలుసుకోండి సార్ అని మళ్లీ క్లారిటీ ఇచ్చిన వసు, సాక్షికి పెద్ద షాక్ ఇచ్చిన రిషి అండ్ కో!