మాధవ దేవి గెలిచిన కప్ తీసుకుని ఇంటికి వస్తాడు. అది చూసి రామూర్తి దంపతులు సంతోషిస్తారు. దేవి అనుకున్నదంటే సాధిస్తుందని జానకి అంటుంది. రాధ, దేవి ఇంక రాలేదేంటి అని అడుగుతారు. ఆదిత్య దేవిని తీసుకురాకుండా రావడంతో దేవుడమ్మ ఏమైందని అడుగుతుంది. దానికి ఇష్టమైనవన్నీ చేసి పెట్టాను ఎందుకు తీసుకురాలేదని అంటుంది. రాత్రి పగలు కష్టపడి నేర్పించావ్ ఆ సంతోషం నీ ముఖంలో లేదేంటి అని అంటుంది. ఇటు రామూర్తి దంపతులు ఆదిత్య వల్లే దేవి గెలిచిందని అంటారు. దేవి తన తండ్రి గురించి అన్న మాటలు గుర్తు చేసుకుని రుక్మిణి అల్లాడిపోతుంది. ఏం చేయాలి నా బిడ్డకి ఆఫీసర్ సారె మీ నాయన అని చెప్పే లోపు ఆ మాధవ సారు నా బిడ్డ మనసు పాడు చేశాడు. ఇప్పుడు ఆఫీసర్ సార్ మి నాయన అంటే దేవి ఊరుకుంటుందా. నా పెనిమిటి మొహం చూడాలంటే పెనిమిటి ఆగమైపోతాడు అని మనసులోనే మథన పడుతుంది. అది చూసి దేవి ఎందుకమ్మ ఏడుస్తున్నావ్, నాయన గురించి నాకు తెలిసిందనా. నాకు తెలుసు నాయన గురించి తెలిస్తే మస్త్ బాధపడతా అని చెప్పలేడు కదా అని అడుగుతుంది. మీ నాయన నువ్వు అనుకున్నంత దుర్మార్గుడు కాదని రుక్మిణి అంటుంది. 


Also Read: ఖైలాష్ ని చితక్కొట్టిన యష్, వేదకి క్షమాపణ చెప్పనన్న యష్-తగ్గేదెలే అంటున్న వేద


'ఎందుకమ్మా అబద్ధాలు చెబుతున్నావ్, నాయన ఆసువంటోడు కాకపోతే ఇన్ని దినాలకెల్లి నాయన గురించి నాకెందుకు చెప్పలేదు. సరే నువ్వు చెప్పలే నువ్వు నేను ఇక్కడ ఉన్నామని తెలుసు కదా, మరి నాయన ఏ పొద్దు ఎందుకు రాలేదు. ఇన్ని దినాలు రాత్రి ఒంటరిగా కూర్చుని బాధపడ్డావ్. ఇప్పుడు కూడా నాయన గురించేగా గసువంటోడు అని తెలిస్తే నాయన మొహం చూడనని నాకు అబద్ధం చెప్పావ్. అదే నాయన మంచోడు అయితే నువ్వు నేను ఇక్కడ ఎందుకు ఉంటాం, నాయన ఉండనిస్తాడా, నాయన చెప్పింది నిజం నిన్ను మస్త్ బాధ పెట్టినడు అందుకే మొహం చూపించకుండా తిరుగుతున్నాడు. ఆ నాయన నాకు నాయనే కాదు, ఇన్ని దినాలు నన్ను సొంత బిడ్డ లెక్క చూసిండంటే ఈ నాయనే నా నాయన. ఈ నాయన కాడె ఉండి నేను మంచిగా చదువుకుంటా, ఆఫీసర్ సార్ లెక్క పెద్ద కలెక్టర్ అవుతా, నాయన నిన్ను మంచిగా చూసుకోకపోయిన నిన్ను మంచిగా చూసుకుంటాలెమ్మ. గట్లనే మా నాయన ఎక్కడ ఉన్నా పట్టుకుంటా. నిన్నే బాధపెట్టినడు కదా విడిచిపెట్టను, కడుపుతో ఉన్న నిన్ను విడిచి పెట్టినడు కదా ఆ కసాయోడిని ఓ తీరు చూస్తా, ఫోటో ఏదైనా ఉన్నదా' అని దేవి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. ఆ మాటలకి రుక్మిణి కుమిలి కుమిలి ఏడుస్తుంది. 


మాధవ ఆదిత్య దేవికి ముద్దు పెట్టడం తలుచుకుని రగిలిపోతాడు. అక్కడ జరిగిన పోటీ పిల్లలకి కాదు నాకు రాధకి. అందులో నేనే గెలిచాను, అంటే ఆ కప్పు నాకు వచ్చినట్టు అని క్రూరంగా అనుకుంటాడు. అప్పుడే కోపంగా రాధ అక్కడికి వస్తుంది.


Also Read: మాధవ పైశాచికత్వం, నేను మీ నాన్నని కాదని దేవికి నిజం చెప్పిన మాధవ_ షాక్లో రుక్మిణి


మాధవ: రా రాధ నీ గురించే అనుకుంటున్నా 


రాధ: సారు.. అని గట్టిగా అరుస్తుంది. నా బిడ్డకి ఏం చెప్పావ్ అని నిలదిస్తుంది.


మాధవ: ఏం చెప్పానో దేవి చెప్పే ఉంటది కదా


రాధ: దేవుడంటి నా పెనిమిటి గురించి దుర్మార్గుడని చెప్తావా, పసి బిడ్డ మనసులో వాళ్ళ నాయన మీద ప్రేమ లేకుండా చేస్తావా 


మాధవ: ఏం చేయను చెప్పు నా మీద ఛాలెంజ్ చేసి మరి దేవిని అదిత్యకి దగ్గర చెయ్యాలని చూశావ్ వద్దు రాధ అంటే వినడం లేదు అందుకే తప్పలేదు 


రాధ: ఇంత చెయ్యనికి నీకు మనసేలా వచ్చింది సారు, ని స్వార్ధం కోసం నా పెనీమిటిని రాక్షసుడిని చేస్తావా 


మాధవ: తప్పే కానీ ఆ తప్పు చెయ్యదానికి కారణం నువ్వు, మంచిగా నా మాట విననప్పుడు దారి తప్పడం తప్ప లేదు. నా కూతురుకి తల్లి కావాలి. ఈ ఇంటికి మంచి కోడలు కావాలి. మా అమ్మానాన్నకి నువ్వే కోడలు కావలి. నాకు కూడా నువ్వే కావాలి..  అనడంతో రాధ కోపంగా మాధవని కొట్టేందుకు చెయ్యి ఎత్తుతుంది. 


రాధ: నేను ఏందో ఏసువంటి దాన్నో నీకు చెప్పినా, అయినా నీ బుద్ధి మారలా. ఇంక ఈ ఇంట్లో నేను ఉండుడు నాది తప్పు. నీ మాటలు భరిస్తూ నేను నా బిడ్డ ఈ ఇంట్లో ఉండాల్సిన కర్మ పట్టలే. ఇప్పుడే నా బిడ్డని తీసుకుని ఇంట్లో నుంచి పోతా, ఇన్ని రోజులు నా బిడ్డ దగ్గర దాచిన నిజం చెప్పేస్తా, ఆఫీసర్ సారె మీ నాయన అని చెప్పి నా పీనిమిటి కాడికి చేరుస్తా 


మాధవ: ఆవేశపడకు రాధ 


రాధ: నువ్వు చేసే పణులకి ఏదో ఒక పొద్దు నిన్ను చంపుతా, ఆ రోజు రాక ముందే ఆఫీసర్ సార్ మీ నాయన అని దేవుడు దుర్మార్గుడు కాదని చెప్తా, ఈ ఇంట్లో కెళ్ళి తీసుకుపోయి జీవితంలో నీ మొహం చూడను అని వెళ్లిపోతుంటే రాధ ఒక్క నిమిషం అని మాధవ ఆపుతాడు. 


మాధవ: ఒక మాట చెప్తాను విని వెళ్ళు, సరే దేవిని తీసుకెళతావ్ మీ నన్న రాముడు అని చెప్పి నన్ను రాక్షసుడిని చేస్తావ్ ఇదంతా బాగానే ఉంది కానీ నాన్న నిన్ను ఎందుకు వదిలేశాడు అంటే ఏం చెప్తావ్, నువ్వు ఎందుకు దూరంగా వచ్చేశావ్ అని అడిగితే ఏం చెప్తావ్. ఇంతా కాలం ఇక్కడే ఉన్న నాన్న మనల్ని ఎందుకు ఇక్కడే వదిలేశాడని అంటే ఏం సమాధానం చెప్తావ్? నిన్ను వదిలేసి నన్ను మాత్రమే దత్తత తీసుకోవాలని ఎందుకు అనుకున్నాడంటే ఏం చెప్తావ్. నేను ఇంత దగ్గర అవుతున్నా ఆయనే మా నాన్న అని ఇప్పుడేందుకు చెప్తున్నావ్ అని అంటుంది. ఇలా చాలా చాలా ప్రశ్నలకి నువ్వు సమాధానం చేపతేనే కానీ ఈ ఇంటి గడప దాటలేవ్. నువ్వు కావాలి అన్న మాటకి నీలో అంతా ఆవేశం వచ్చిందే అది నీ ఆత్మాభిమానం. నాకు ఇప్పుడు నీ మీద ఇంక ఇష్టం పెరిగింది. నిన్ను నాదాన్ని చేసుకోవాలనే పట్టుదల ఇంక ఇంక పెరుగుతూనే ఉందని నీచంగా మాట్లాడతాడు. నువ్వు వెళ్లలేవ్ రాధ అని మనసులో అనుకుంటాడు.