యష్ ఖైలాష్ గురించి నిజం బయట పెట్టినా కూడా కాంచన ఆ మాటలు నమ్మదు. ఖైలాష్ కూడా చేసిన తప్పుని కప్పి పుచ్చుకునేనుందుకు ప్రయత్నించాడు. అందరూ నన్ను చాలా మాటలు అన్నారు, ఈ వేద ఫోన్ నుంచే నాకు మెసేజ్ లు వచ్చాయి. నన్ను ప్రేమించు ప్రేమించు అని నా వెంటపడింది. మీరీ ఖుషి తల్లి హోదా ఇచ్చి నెత్తి మీద కూర్చోబెట్టుకున్నారు అదే మీరు చేసిన అసలు తప్పు. ఈ పనికిమాలిన మనిషికి పరువు గురించి ఏం తెలుసు అనేసరికి వేద లాగిపెట్టి ఖైలాష్ ని చెంప మీద కొడుతుంది. ఏం మాట్లాడుతున్నావ్ రా నువ్వు నేకు ఇంకా సిగ్గు రాలేదా అని వేద తిడుతుంది. ఇక యష్ కూడా నా భార్య గురించి తప్పుగా మాట్లాడతావ్ అని ఖైలాష్ ని పిచ్చ పిచ్చగా కొడతాడు. ఇంట్లో అందరూ యష్ ని ఆపేందుకు ప్రయత్నించిన ఆగడు. అప్పుడే పోలీసులు వచ్చి ఆపేస్తారు. పోలీసులు ఖైలాష్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఇక అందరూ కలిసి నాకు అన్యాయం చేశారని కాంచన ఏడుస్తుంది. తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు సారిక వేదని క్షమాపణ కోరుతుంది. 


Also Read: మనసు తెలుసుకోండి సార్ అని మళ్లీ క్లారిటీ ఇచ్చిన వసు, సాక్షికి పెద్ద షాక్ ఇచ్చిన రిషి అండ్ కో!


వేద ఇక మా ఇంటికి వెళ్తానని రత్నం కి చెప్తుంది. తన తండ్రిని తీసుకుని వెళ్లబోతుంటే యష్ శశిధర్ ని పిలుస్తాడు. 'అప్పుడు మీకు నేను నచ్చలేదు, ఇప్పుడు నచ్చానా..  మీ దృష్టిలో అప్పుడు చెడ్డ వాడిని ఇప్పుడు మంచి వాడిని అయ్యానా, ఒకటే ప్రశ్న అడుగుతాను, నాకు సమాధానం కావాలి. గతంలో మీ అమ్మ, తమ్ముడు వేదతో పెళ్లి క్యాన్సిల్ చేసి అవమానించారు. అప్పుడు వేద నీకు చెల్లెలు కాదా? అప్పుడు ఎందుకు నువ్వు ఏమి మాట్లాడలేకపోయావ్? నేను చెప్పనా. ఒక వైపు నీ కుటుంబం, మరో వైపు ఈ అమ్మాయి. నా విషయంలో కూడా అదే జరిగింది శశిధర్. బంధాలకి నేను కూడా కట్టుబడి పోయాను. ఖైలాష్ ఒక మనిషే కాదు జైలుకు వెళ్ళాడు, శిక్ష పడుతుంది. కానీ నష్టపోయిందేవరు మా అక్క. పిచ్చిగా వాడిని మా అక్క ప్రేమిస్తుంది, గుడ్డిగా నమ్ముతుంది. నాకు చెప్పే ముందు నువ్వు ఇవన్నీ ఆలోచించావా, లేదు కానీ నేను ఆలోచించాను. ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను నువ్వు మీ భార్య చెప్పిందని మీ అమ్మతో పోట్లాడతావా? నీ భార్యకి మేలు చెయ్యాలని నీ చెల్లెలకి వ్యతిరేకంగా వెళ్లగలవా?  లేదు కదా. అదే పరిస్థితి నాది కూడా. వేద నిన్ను అడుగుతున్నాను. నీకు న్యాయం జరిగింది కదా, ఖైలాష్ జైలుకి వెళ్ళాడు కదా. కానీ కాంచన పరిస్థితి ఏంటి. కాంచన జీవితం ఏమవుతుంది. ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు ఎప్పుడు అందరి మంచే కోరుకుంటావ్ కదా మరి నీకు ఇంత జరుగుతుంటే నాకు ఎందుకు చెప్పలేదు. నా భార్యవి, నా ఖుషికి తల్లివి కదా మరి ఎందుకు దాచిపెట్టావ్, నేను నీకు న్యాయం చేయను అనుకున్నవా. నేను నీకు సహాయం చేయనని నేకు నువ్వే అనుకున్నవా? అసలు నిజమే తెలియకపోతే నేను ఎలా న్యాయం చేయగలుగుతాను' అని యష్ తన మనసులోని ఆవేదన అంతా వెళ్లగక్కుతాడు. 


Also Read: చెస్ పోటీలో విజేతగా దేవి, మురిసిపోయిన రుక్మిణి, ఆదిత్య- దేవి కన్న తండ్రి ఆదిత్యే అని రుక్మిణి చెప్పనుందా?


'మీ కూతురికి న్యాయం జరిగింది కానీ మా అక్క జీవితాంతం బాధపడుతూనే ఉండాలి. ఇవాళ నా ఇల్లు ముక్కలైపోయింది. నాకు లెక్చర్లు ఇవ్వడం చేతకాదు. ఏది మంచిది అనిపిస్తే అదే చేస్తాను. ఇక చాలు నేను ఏం చేయాలో అది చేశాను, ఏం చెప్పాలో అది చెప్పాను. నేను ఇంకా ఏమి చేయలేదని మీలో ఎవరికైనా అనిపిస్తే సారీ. ఇంతకంటే నేను ఏం చెయ్యలేను, ఎవరు ఎక్కడికి వెళ్తారో అక్కడికి వెళ్ళండి ఐ డోంట్ కేర్. నేను ఎవరిని బతిమలాడి చేతులు చాచలేను క్షమాపణలు ఆడగలేను విషయం అర్థం చేసుకునే వాళ్ళకే విషయం అర్థం అవుతుంది.. ఇంకా అర్థం కాలేని వాళ్ళ కోసం నేనేమీ చెయ్యలేను' అని యష్ అక్కడి నుంచి బాధగా, కోపంగా వెళ్ళిపోతాడు. ఇక యష్, వేద జరిగింది అంతా తలుచుకుని బాధపడుతూ ఉంటారు. మీ నుంచి నేను కోరుకుంది ఇది కాదండీ, నింద పడిన రోజే ప్రాణం పోయిన నా వేద ఏ తప్పు చెయ్యదు అని ఒక్కమాట ఒకే ఒక్క మాట మీరు అనాలనుకున్నాను' అని వేద మనసులోనే బాధపడుతుంది. 'నన్ను వదిలి నీకు ఎలా వెళ్లాలనిపిస్తుంది. నీ భర్తగా నీ తప్పు లేదని నీ నిజాయితీని నిరూపించాను. ఇంతకన్నా నేను ఏం చెయ్యగలను. నువ్వు ఏ తప్పు చేయలేదని నేను అనకపోవడానికి కారణం నా కుటుంబం అని నీకు ఇంకా అర్థం కాలేదా. నా గుండె చప్పుడు నీకు వినిపిస్తే  ఒక్కసారి విను వేద అది నిన్నే తలుచుకుంటుంది. నువ్వు పరిస్థితిని అర్థం చేసుకుని నువ్వే తిరిగి వాస్తవని ఎదురు చూస్తుంటా వేద' అని యష్ మనసులో కుమిలిపోతాడు.