కార్తీకదీపం జులై 21 గురువారం ఎపిసోడ్ (Karthika Deepam july 21 Episode 1410)
నిరుపమ్ తో పాటూ కార్లో వెళుతున్న శౌర్య...ఒక్క క్షణం ఫీలైనా మళ్లీ అంతలోనే నేనెందుకు బాధపడాలి అనుకుంటూ నిరుపమ్ డ్రైవ్ చేస్తుంటే వెనుక సీట్లో కాలుపై కాలేసుకుని కూర్చుంటుంది. కావాలని తన ఫ్రెండ్ కి కాల్ చేసి ఆటో నడిపే నేను కారు ఓనర్ అవొచ్చు..కారు ఓనర్ రేపు మనకు డ్రైవర్ అవొచ్చు..అంతేకానీ ఆటో నడుపుతున్నాం అని అస్సలు ఫీలవొద్దంటుంది.
నిరుపమ్: ఏంటి శౌర్య నువ్వు ఇన్ డైరెక్ట్ గా నన్ను అంటున్నావా..పోనీలే అని కార్లో ఎక్కిస్తే వెనుక సీట్లో కూర్చుని బిల్డప్ ఇస్తున్నావా
శౌర్య: నాకేమైనా లిఫ్ట్ ఇచ్చాను అనుకుంటున్నారా..అంత అవసరం లేదు నేను ఆటో ఆపితే ఫ్రీగా ఇంటికెళ్లిపోతాను
నిరుపమ్: మనిద్దరం ఓ విషయంపై క్లారిటీగా మాట్లాడుకున్నాం...ఇంకా ఎందుకు మనసులో పెట్టుకుని మాట్లాడుతావ్...
శౌర్య: ఇంతలో కారు ఆపేయడంతో ఏంటి రోడ్డుపై దించేయాలని అనుకుంటున్నారా..మధ్యలో వచ్చినదాన్ని మధ్యలోనే పోతాను లెండి అంటూ కిందకుదిగి ఇల్లొచ్చిన విషయం గమనిస్తుంది
నిరుపమ్: అందుకే వెనుకా ముందూ చూసుకోకుండా మాట్లాడకూడదు అంటాడు... ప్రేమ్ రా వెళదాం
ప్రేమ్: అప్పుడేనా కాసేపు ఉండి వెళదాం
నిరుపమ్: పని ఉంది అమ్మమ్మా
శౌర్య: ఒక్క నిముషం డాక్టర్ సాబ్ అని నిరుపమ్ దగ్గరకు వెళ్లిన శౌర్య..చేతిలో ఫోన్ పెడుతుంది. ఎప్పటి నుంచో తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను కుదర్లేదు..మీ ఫోన్ మీరు తీసుకోండి ( అప్పట్లో నిరుపమ్ కొనిచ్చిన ఫోన్ అది)
వీళ్లిద్దర్నీ కలపడం కష్టమే అని ప్రేమ్...శౌర్య ఇంత కోపంగా ఉంది వీళ్లని ఎలా ఒకటి చేయాలని హిమ అనుకుంటారు...
Also Read: నిరుపమ్-శౌర్యని దగ్గర చేసేందుకు ప్రేమ్ ప్లాన్, పెళ్లి ఆపే ప్రయత్నంలో స్వప్న-శోభ
శౌర్య వచ్చిందని ఆనందపడాలో...ఇలా ఉంటోందని బాధపడాలో అర్థంకావడం లేదంటాడు ఆనందరావు. అన్ని కష్టాలు తీరిపోతాయి లెండి అని సర్దిచెప్పిన సౌందర్య..బోనాలు పండుగ బాగా చేద్దాం అంటుంది. తెల్లారగానే బోనాల సందడి మొదలవుతుంది.
హిమతో నా లైఫ్ హ్యాపీగా సాగిపోతుందని మనసులో కోరుకుంటాడు నిరుపమ్ . ఎంత బావుందో హిమ అనుకున్న ప్రేమ్..శౌర్య నిరుపమ్ లను కలిపితే నాకు లైన్ క్లియర్ అవుతుందనుకుంటూ.... అందర్నీ నిల్చోమని చెప్పినట్టే చెప్పి నిరుపమ్-శౌర్యకి ఫొటోస్ తీస్తాడు. మళ్లీ బోనాల పండుగ వచ్చేనాటికి అందరి పెళ్లిళ్లు అయిపోవాలంటుంది చంద్రమ్మ... మా జ్వాలమ్మ పెళ్లికి నేను తీన్ మార్ డాన్స్ వేస్తాను. ఆపు పిన్ని బోనాల దగ్గరకు వచ్చి పెళ్లి మాట్లేంటి అని కోప్పడిన శౌర్యతో.. ఇంట్లో ఆడబిడ్డ బోనం ఎత్తితే తొందరగా పెళ్లవుతుందని చెబుతుంతి చంద్రమ్మ. బియ్యం పోసి దండం పెట్టుకోండి అని సౌందర్య చెప్పడంతో నువ్వు పెద్దదానివి కదా ముందు నువ్వే వేయి అని హిమ అంటే ఇదో డ్రామానా అని కోప్పడుతుంది శౌర్య. అందరూ బియ్యం వేసి దండం పెట్టుకుంటారు. ఆ తర్వాత హిమ, శౌర్య, సౌందర్య బోనం ఎత్తుకుంటారు.
Also Read: ఎట్టకేలకు రిషికి 'ఐ లవ్ యూ' చెప్పేసిన వసుధార, సాక్షిని ఆడేసుకున్న గౌతమ్
దూరదూరంగా ఉంటావేంట్రా అందరితో కలసిపోవాలని ప్రేమ్ అనడంతో..నేను నీలా అందరితో పోట్లాడలేను, వెంటనే కలసిపోలేనని రిప్లై ఇస్తాడు నిరుపమ్. హిమను చూస్తూ మురిసిపోతారు నిరుపమ్, ప్రేమ్. అటు ప్రేమ్ మాత్రం నిరుపమ్-శౌర్య కి జంటగా ఫొటోలు తీస్తాడు. అమ్మవారికి బోనం సమర్పించి ఎవరికి వారే తమ మనసులో కోరికలు కోరుకుంటారు
శౌర్య: కోరుకోవాడనికి నాకేం మిగిలింది
హిమ: ఏం కోరుతున్నా శౌర్య మంచికోసమే కదా
సౌందర్య: ఈ ఇద్దర్నీ కలిపే బాధ్యత నీదేనమ్మా
మీ మనసులో ఓ కోరిక కోరుకుని చీటీపై రాసి ఆ హుండిలో వేస్తే నెరవేరుతాయని పూజారి చెప్పడంతో మంచి మాట చెప్పారు పంతులుగారు అంటాడు ప్రేమ్... ఎపిసోడ్ ముగిసింది..
Also Read: శౌర్య-నిరుపమ్ ని కలపబోతున్న బోనాలు పండుగ, ప్రేమ్ తన మనసులో మాట హిమకు చెబుతాడా!
రేపటి(శుక్రవారం) ఎపిసోడ్ లో
శౌర్యకి బావకి పెళ్లి కావాలని రాసిన హిమ..తనేం రాసిందో తెలుసుకోవాలి అనుకుంటుంది. శౌర్య వేసిన చీటీ ఓపెన్ చేసి చూసి షాక్ అవుతుంది.