కార్తీకదీపం జులై 19 మంగళవారం ఎపిసోడ్ (Karthika Deepam july 19 Episode 1408)


నిరుపమ్-స్వప్న
ఒంటరిగా కూర్చున్న నిరుపమ్...హిమ అన్న మాటలు తలచుకుని బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే స్వప్న అక్కడికి వచ్చి దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడగగా వెంటనే నిరుపమ్ ప్రతి ఒక్క మనిషికి పర్సనల్ స్పేస్ అని ఉంటుంది నేను దేనిగురించి  ఆలోచిస్తున్నా కూడా నీకు చెప్పాలా మమ్మీ అనగా వెంటనే స్వప్న...నేను నీ పెళ్లికి ఒప్పుకుని తప్పు చేశాను అని అనడంతో వెంటనే నిరుపమ్ స్వప్న పై సీరియస్ అవుతాడు. భోజనానికి రమ్మంటే ఆకలిలేదని చెప్పడంతో స్వప్న ఫైర్ అవుతుంది.అసలు దాన్ని అనాలి నిన్నుకాదు అనగానే నిరుపమ్ కోప్పడతాడు..నువ్వు అస్తమానం హిమను తిట్టడం మానెయ్ అని చెప్పేసి నాకు ఆకలి లేదంటూ వెళ్లిపోతాడు.
 
హిమ -సౌందర్య
శౌర్య మనసు మారదా అని బాధపడుతుంటగా అప్పుడే అక్కడకు వస్తుంది సౌందర్య. నానమ్మా శౌర్య మారదా అని అడుగుతుంది. కొన్నేళ్ల పాటు మనకు దూరం అయింది కదా కష్టాలు పడింది... ఆ కోపం అంతా తొందరగా పోదు అని అంటుంది. భోజనానికి రా అని సౌందర్య పిలిస్తే నాకు ఆకలిలేదు మీరు వెళ్లండి అనేస్తుంది హిమ. 


శౌర్య-ఆనందరావు
భోజనానికి రామ్మా శౌర్య అంటే..నాకు ఆకలిలేదు తాతయ్య మీరు వెళ్లి భోజనం చేయండి అంటుంది. 
ఆనందరావు: ఇన్నేళ్లూ మనం విడిపోయాం...ఇప్పుడు ఇక్కడున్న ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తున్నాను...భోజనం చేస్తున్న ప్రతిసారీ నువ్వు తిన్నావో లేదో,ఎక్కడున్నావో అని బాధపడేవాళ్లం..అలాంటిది నువ్వు ఇంటికొచ్చాక కూడా నిన్ను వదిలేసి ఎలా భోజనం చేస్తాం 
శౌర్య: నేను ఇంట్లోంచి వెళ్లిపోగానే భోజనం మానేశారా..ఒక్కపూట, రెండుపూటలు, మూడు పూటలు మానేసి ఉంటారు ఆ తర్వాత అంతా మామూలే కదా. వెళ్లండి తాతయ్య మీరు బాధపడతారు నా మాటతీరు ఇలాగే ఉంటుంది..


Also Read: రౌడీ బేబీ తగ్గట్లేదు, డాక్టర్ సాబ్ మారడంలేదు - మధ్యలో ఉక్కిరి బిక్కిరవుతున్న హిమ


సౌందర్య-ఆనందరావు
హిమ ఏదని ఆనందరావు... శౌర్య ఏదని సౌందర్య ఒకర్నోకరు అడుగుతారు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వీళ్లిద్దరూ మారడం లేదనుకుంటారు. ఇద్దరూ ఇంట్లో నిల్చుని ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా అనుకుంటారు. మేం ఇంట్లో ఉండం..వృద్ధాశ్రమానికి వెళతాం అని చెప్పాలనుకుంటారు. ఇద్దరూ నటన గురించి సరదాగా డిస్కస్ చేసుకుంటారు. అయినా వీళ్లిద్దర్నీ ఒక్కటి చేయడానికి ఇంకెన్ని ప్లాన్స్ వేయాలో అనుకుంటారు. ఇంతలో హిమ-శౌర్య వస్తారు....
ఆనందరావు: ఇద్దరం వృద్ధాశ్రమానికి వెళ్లిపోతున్నాం అని చెబుతారు. 
సౌందర్య: స్టమక్ చించుకుంటే లెగ్స్ మీద పడుతుంది అన్నట్టు మీరా కలసి ఉండరు..భోజనం చేయమంటే చేయరు. మీరు తినకుండా నేను తినను..నేను తినకపోతే మీ తాతయ్య తినరు. ఈ వయసులో మమ్మల్ని ఎందుకిలా హింసపెడతారు. రాత్రి భోజనం తినలేదు, పొద్దున్న టిఫిన్ తినలేదు..ఇలా అయితే మేం ఉండలేం. ఈ రోజుతో ఈ ఇంటికి మనకు రుణం తీరిపోయింది పదండి వృద్ధాశ్రమానికి వెళదాం..
ఆనందరావు: అక్కడ దోమలుంటాయి కదా
సౌందర్య: మనకు ఈ మనవరాళ్ల కష్టాల కన్నా దోమల కష్టాలు పెద్ద కష్టం కాదు
హిమ-శౌర్య ఇద్దరూ కలసి వాళ్లని ఆపేస్తారు..మీరు వెళ్లడానికి వీల్లేదని హిమ...నన్ను ఇంట్లోకి రమ్మని మీరు వెళతారా అని శౌర్య అంటారు. ఇకపై మీరు చెప్పినట్టు వింటాం లోపలకు పదండి అంటారిద్దరూ. 


Also Read: వసుని అవమానించిన సాక్షికి మైండ్ బ్లాక్ అయ్యే కౌంటర్ ఇచ్చిన రిషి, మనసులో ప్రేమను చెప్పకనే చెప్పిన వసు


మరొక వైపు శోభ నిరుపమ్ గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉండగా ఇంతలో బ్యాంకు మేనేజర్ ఫోన్ చేసి డబ్బులు కట్టకపోతే హాస్పిటల్ సీజ్ చేస్తాం అని అనడంతో టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ తరువాత శోభ,నిరుపమ్(Nirupam)గురించి స్వప్న ఫోన్ చేసి మాట్లాడుతుంది. మరోవైపు సౌందర్య, ఆనందరావు మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి చంద్రమ్మ వస్తుంది. ఓసారి మా జ్వాలమ్మ..అదే..మీ శౌర్యని చూడాలనిపించి వచ్చానంటుంది.
సౌందర్య: నువ్వేం పరాయిదానివి కాదుకదా మా మనవరాలిని ప్రేమగా చూసుకున్నావ్..నీకు మేం రుణపడి ఉన్నాం అని నమస్కారం పెడతారు.
ఇంద్రమ్మ: పెద్దవాళ్లు మీకు నాకు దండం పెడుతున్నారు
సౌందర్య: నీలా ఎలాంటి స్వార్థం లేకుండా ఉన్నవాళ్లు పెద్దవాళ్లు, గోప్పవాళ్లు
ఇంతలో అక్కడకు వచ్చిన జ్వాలను హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది చంద్రమ్మ. ఇంట్లో బోనాలు పండుగ చేస్తున్నాం మీరంతా రండి అంటుంది. 
శౌర్య: వీళ్లంతా ఎందుకొస్తారు చెప్పు 
సౌందర్య: ఎందుకురాము..వస్తాం..ఏమ్మా నేను బోనం ఎత్తుకోవచ్చా అని చంద్రమ్మని అడుగుతుంది. నువ్వు ఇంటికి వచ్చావు కదా ఆ అమ్మవారికి ఈ రకంగా అయినా దండం పెట్టుకుంటాను
చంద్రమ్మ: బోనం ఎత్తుకుంటే మంచిదేనమ్మా..ఏం కోరుకున్నా జరుగుతుంది. మా ఇంటినుంచి బోనం మీరు ఎత్తుకోండి.. బోనానికి ఏర్పాట్లన్నీ నేను చేస్తాను..అమ్మవారికి పెట్టే చీర, గాజులు మీరు కొంటేనే మంచిది.
ఆనందరావు: తప్పకుండా కొంటాం..నువ్వొచ్చి ఈ ఇంట్లో కొత్త సంతోషాలు నింపావు..
వెళ్లొస్తానని చెప్పిన చంద్రమ్మతో..వీలుచూసుకుని మా ఇంటికి వచ్చి నాలుగురోజులు ఉండివెళ్లండి అంటుంది సౌందర్య..
శౌర్య బయటకు వెళుతుండగా ఎక్కడికి వెళుతున్నావ్..కావాల్సినవి కొనుక్కుని వద్దాం అన్న సౌందర్యతో నేను రాను అంటుంది. అందరం సంతోషంగా బోనాలు పండుగ చేసుకుందాం అని ఆనందరావు అంటాడు. హిమ ఏదో చెప్పబోతుంటే నువ్వు చెప్పాల్సిన పనిలేదు నేను వస్తాను అంటుంది. 
ఆనందరావు: ఈ బోనాల పండుగలో ఇద్దరి మనవరాళ్లతో పాటూ ఇద్దరు మనవళ్లు కూడా ఉంటే బావుంటుంది
హిమ: నేను ఫోన్ చేసి పిలుస్తానంటూ కాల్ చేసి ప్రేమ్, నిరుపమ్ కి పిలుస్తుంది..


ఎపిసోడ్ ముగిసింది..


Also Read: శౌర్యకి మళ్ళీ ఐ లవ్యూ చెప్పిన డాక్టర్ సాబ్- హిమ, నిరుపమ్ పెళ్లి చెడగొట్టేందుకు ప్రేమ్ స్కెచ్


రేపటి(బుధవారం) ఎపిసోడ్ లో
ఆటోలో బయలుదేరిన శౌర్యని ఆపి కారెక్కిస్తుంది సౌందర్య. కావాలని కారు బ్రేక్స్ వేస్తుంటుంది. ఇద్దరూ ఎడమొహం