జమ్ముకశ్మీర్ బారాముల్లా జిల్లా సోపోర్ లో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. సోమవారం మొదలైన ఈ ఆపరేషన్ ఈ రోజు ఉదయం ముగిసినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం ప్రాంతాన్ని బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి.














ఎన్ కౌంటర్ ప్రదేశం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసకున్నారు పోలీసులు. అయితే మృతి చెందిన ఉగ్రవాదుల వివరాలు ఇంకా వెల్లడించలేదు.


Covid 19 Vaccine: వాట్సాప్‌లో కోవిడ్ వ్యాక్సిన్ ‘స్లాట్‌ బుకింగ్‌’.. ఇలా బుక్ చేసుకోండి..


పక్కా ప్లాన్..


సోపోర్ లోని పేత్ సీర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. బలాగాలను చూడగానే ఉగ్రవాదులు కాల్పులు చేశారు. భద్రతా దళాలు చేసిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు.


గంటల పాటు సాగిన ఈ ఎన్ కౌంటర్ కు ముందే అక్కడి ప్రజలను పోలీసులు తరలించారు. ఉగ్రవాదులు లొంగిపోవాలని పోలీసులు కోరినప్పటికీ మాట వినకుండా కాల్పులు జరిపినట్లు తెలిపారు.


గతవారం అవంతిపొరా పాంపోర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు హిజ్ బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు హతమయ్యారు.


Also Read: Ukrainian plane Hijacked: అఫ్గానిస్థాన్ లో ఉక్రెయిన్ విమానం హైజాక్