15 th August 2024 School News Headlines Today:

 

నేటి ప్రత్యేకత


  • నేడు భారత 78వ స్వాతంత్య దినోత్సవం


జాతీయ వార్తలు



  • దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. త్రివర్ణ పతాక రెపరెపలతో దేశం వెలిగిపోతోంది. ప్రధాని మోదీ 11వసారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేయనున్నారు. త్రివిధ దళాల కవాతును చూసేందుకు ఎర్రకోటకు భారీగా ప్రజలు తరలివచ్చారు

  • తెలుగు రాష్ట్రాల్లోనూ 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయిు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాసేపట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. మంత్రులు, అధికారులు కూడా స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొననున్నారు.  

  • 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతినుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. సామాజిక న్యాయమే ఫ్రాధాన్యంగా ప్రధాని మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, అణగారిన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. 


 

ఆంధ్రప్రదేశ్‌ వార్తలు


  • ఆంధ్రప్రదేశ్‌లో నేడు అన్న క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. గుడివాడలో సీఎం చంద్రబాబునాయుడు తొలి అన్న క్యాంటీన్‌ను ప్రారంభించనున్నారు. రేపు 99 అన్న క్యాంటీన్లను మంత్రులు, ప్రజా ప్రతినిధులు ప్రారంభిస్తారు. తొలి విడతలో మొత్తం 100 అన్న క్యాంటీన్లు తెరుస్తున్నారు. 

  • ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారిగాఐఎఫ్‌ఎస్‌ అధికారి పర్వతనేని హరీశ్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం జర్మనీలో భారత రాయబారిగా హరీశ్‌ విధులు నిర్వహిస్తున్నారు. ఆయనను ఐరాసలో భారత ప్రతినిధిగా నియమించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హరీశ్‌ విశాఖలో జన్మించి... విజయవాడలో పెరిగారు. 


తెలంగాణ వార్తలు


  • తెలంగాణలో జరగనున్న రాజ్యసభ ఉపఎన్నికకు తమ అభ్యర్థిగా సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీని కాంగ్రెస్ నామినేట్ చేసింది. బీఆర్‌ఎస్ ఎంపీ కె. కేశవరావు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరడంతో ఆ స్థానం ఖాళీ అయింది. తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్‌ మను సింఘ్వీని ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది.

  • తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన విజయవంతమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణకు భారీగా పెట్టుబడులు వచ్చాయి. అమెరికా పర్యటనలో రూ.31502 కోట్ల పెట్టుబడులు రాగా.. దక్షిణ కొరియాలో రూ.4500 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 


క్రీడా వార్తలు


  • రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు నిరాశ ఎదురైంది. ఒలింపిక్స్‌లో తనకు సిల్వర్ పతకమైనా ఇవ్వాలంటూ వినేష్ ఫోగట్ దాఖలు చేసిన అప్పీల్‌ను కాస్ డిస్మిస్ చేసింది. వినేష్ అభ్యర్థనను కాస్ తిరస్కరించింది. ఈ పిటిషన్‌పై గట్టి వాదనలు వినిపించినప్పటికీ.. ఫోగట్ అభ్యర్ధనను కాస్ పట్టించుకోలేదు. 

  • దులీప్ ట్రోఫీ 2024 మొదటి రౌండ్ మ్యాచ్‌ల కోసం బీసీసీఐ జట్లను ప్రకటించింది. టీమ్ ‘A’కి శుబ్‌మన్‌ గిల్, టీమ్ ‘B’కి ఈశ్వరన్, టీమ్ ‘C’కి రుతురాజ్‌ గైక్వాడ్, టీమ్ ‘D’కి శ్రేయస్స్‌ అయ్యర్ కెప్టెన్లుగా ఉంటారు. 


మంచిమాట

స్వాతంత్ర్యం అంటే ఒకరు ఇచ్చేది కాదు... మనం సంపాదించుకునేది..