Double iSmart Movie Review Telugu: 'డబుల్ ఇస్మార్ట్' భారీ అంచనాల నడుమ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'లైగర్' డిజాస్టర్ తర్వాత పూరి జగన్నాథ్ (Puri Jagannadh), 'స్కంద' ఏవరేజ్ తర్వాత హీరో ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) కలిసి చేసిన ఫిల్మ్ ఇది. అటు హీరో, ఇటు డైరెక్టర్ ఫ్లాపుల్లో ఉన్నా ఇంత బజ్ రావడానికి కారణం 'ఇస్మార్ట్ శంకర్' విజయం. ఆ మూవీ విడుదలకు ముందు కూడా ఇద్దరికీ భారీ విజయాలు లేవు. అందువల్ల, 'డబుల్ ఇస్మార్ట్' మీద క్రేజ్ క్రియేట్ అయ్యింది. ఆల్రెడీ అమెరికాలో ప్రీమియర్లు పడ్డాయి. మరి, ఈ సినిమాకు సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందో చూడండి.
రాడ్ అనుకుంటే హిట్ / సూపర్ హిట్ దిశగా...
''పక్కా హిట్ అనుకున్న 'మిస్టర్ బచ్చన్' ఫ్లాప్ అయ్యింది ఆల్మోస్ట్. రాడ్ అవుతుంది అనుకున్న 'ఇస్మార్ట్' (డబుల్ ఇస్మార్ట్') హిట్, సూపర్ హిట్ దిశగా వెళుతోంది'' అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. అమెరికాలో 'డబుల్ ఇస్మార్ట్' ప్రీమియర్స్ కంటే ఏపీ, తెలంగాణలో 'మిస్టర్ బచ్చన్' పెయిడ్ ప్రీమియర్ షోలు పడ్డాయి. దాంతో అక్కడ 'డబుల్ ఇస్మార్ట్' టాక్ కంటే... తెలుగు రాష్ట్రాల్లో 'మిస్టర్ బచ్చన్' టాక్ స్పీడుగా స్ప్రెడ్ అయ్యింది. దాంతో 'డబుల్ ఇస్మార్ట్'కు ఎడ్జ్ వచ్చింది.
రామ్ ఎనర్జీ గురించి సపరేటుగా చెబుతున్నారు!
'డబుల్ ఇస్మార్ట్' ట్విట్టర్ రివ్యూస్ చూస్తుంటే... ప్రతి ఒక్కరూ రామ్ పోతినేని ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు. దాంతో 'రామ్ అంటే ఎనర్జీ... ఎనర్జీ అంటే రామ్' అని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ పాత్రను ఆయన మరోసారి పోషించిన తీరుపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read: కమిటీ కుర్రోళ్ళు రివ్యూ: ఆ క్లైమాక్స్ పవన్ కోసమేనా - నిహారిక నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?
పూరి జగన్నాథ్ పర్ఫెక్ట్ కమ్ బ్యాక్... హిట్టు బొమ్మ!
పూరి జగన్నాథ్ (Puri Jagannadh Double iSmart)కు 'డబుల్ ఇస్మార్ట్' పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ అని పలువురు నెటిజనులు ట్వీట్లు చేశారు. ఫస్టాఫ్ కంప్లీట్ అయ్యే సరికి సినిమాకు పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. పూరి డైరెక్షన్ స్కిల్స్ కూడా డిస్కషన్ పాయింట్ అయ్యాయి.
మణిశర్మ పాటలు సూపర్... సంజయ్ దత్ విలనిజం!
'డబుల్ ఇస్మార్ట్'లో ట్విస్టులు ప్రేక్షకులు ఊహించేలా ఉన్నప్పటికీ... వాటిని పూరి జగన్నాథ్ ఎగ్జిక్యూట్ చేసిన విధానం బావుందని నెటిజనులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా పాటల గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ మాంచి సాంగ్స్ ఇచ్చారని, స్క్రీన్ మీద సైతం ఆ సాంగ్స్ అదిరిపోయాయని టాక్. 'మార్ ముంత చోడ్ చింత' పాటలో రామ్ తన స్టెప్పులతో అదరగొట్టేశారట. ఇక, బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్ దత్ విలనిజం సైతం అదిరిందని... రామ్ - సంజు బాబా మధ్య సీన్లు బావున్నాయని చెబుతున్నారు.
సోషల్ మీడియాలో 'డబుల్ ఇస్మార్ట్'పై ఆడియన్స్ వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఇక్కడ చూడండి: