Justice Umesh Lalit on Court Timings: సుప్రీం కోర్టు పనివేళలపై న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ యూ లలిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లలు రోజూ ఉదయం 7 గంటలకే బడికి వెళ్లగలిగినప్పుడు, కోర్టులు కూడా రోజూ ఉదయం 9 గంటలకు విధులను ఎందుకు ప్రారంభించలేవని ప్రశ్నించారు.
ముందుగా
సుప్రీం కోర్టు పని దినాలకు భిన్నంగా జస్టిస్ యూయూ లలిత్ శుక్రవారం ఉదయం 9.30 గంటలకు కేసుల విచారణను ప్రారంభించారు. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ సుధాంశు ధూలియా కూడా ఉన్నారు.
ఓ బెయిలు కేసులో హాజరైన మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి దీనిపై స్పందించారు. త్వరగా విచారణ ప్రారంభించినందుకు న్యాయమూర్తులను ప్రశంసించారు. కోర్టులు ప్రారంభమవడానికి ఇది చాలా మంచి సమయమన్నారు. రోహత్గి వ్యాఖ్యలపై స్పందిస్తూ జస్టిస్ యూయూ లలిత్ ఇలా అన్నారు.
సుప్రీం సమయం
పని దినాల్లో ఉదయం 10.30 గంటలకు సుప్రీం కోర్టు కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు భోజన విరామం ఉంటుంది. అనంతరం సాయంత్రం 4 గంటల వరకు కార్యకలాపాలు జరుగుతాయి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ తర్వాత ఆ పదవిని జస్టిస్ లలిత్ చేపట్టే అవకాశం ఉంది.
Also Read: Ranil Wickremesinghe: శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘే ప్రమాణం
Also Read: Mohammed Zubair Gets Bail: జర్నలిస్ట్ మహ్మద్ జుబైర్‌కు రిలీఫ్- బెయిల్ మంజూరు