Sankrati Celebrations:  సంక్రాంతి పండగ అంటే సామాన్యుడి పండగ. అందుకే యావత్ కుటుంబంతో కలిసి సొంతూరిలో వేడుక జరుపుకోవాలని లక్షల మంది ప్రజలు అనుకుంటారు. ఎన్ని ఇబ్బందులు పడైనా స్వగ్రామానికి వెళ్లిపోవాలనుకుంటారు. హైదరాబాద్, బెంగళూరు ముంబయి లాంటి నగరాల్లో ఉన్న వారంతా ఈ సంక్రాంతి సీజన్‌లో ఊరి వైపు చూస్తుంటారు. 


ఛార్జీల మోత 


ఈ సీజన్ సామాన్యులకు పండగ ఎలా ఉన్నా సరే ట్రావెల్స్, ప్రభుత్వాలకు మాత్రం నిజమైన పడంగే. ఈ వారం రోజులు విపరీతంగా ఛార్జీలు పెంచేస్తుంటారు. ఇది ప్రైవేటు ఆపరేటర్లకే కాదు ప్రభుత్వ సంస్థలకు కూడా వర్తిస్తుంది. ప్రత్యేక బస్సుల పేరుతో ప్రభుత్వాలు కూడా ఛార్జీలను డబుల్ చేస్తున్నాయి. 


ఏ రూట్లో అయినా ఛార్జీలు భారీగానే ఉన్నాయి


ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మధ్య నిత్యం వందల సంఖ్యలో ప్రభుత్వ ప్రైవేటు బస్సులు తిరుగుతుంటాయి. సాధారణ రోజుల్లోనే ఛార్జీలు తడిసిమోపెడు అవుతుంటాయి. అలాంటితి సంక్రాంతి లాంటి సీజన్స్‌లో మరింత రెచ్చిపోతుంటారు. హైదరాబాద్- రాజమండ్రి(Rajahmundry), హైదరాబాద్‌- వైజాగ్‌(Vizag),  హైదరాబాద్(Hyderabad)- నెల్లూరు(Nellore), నెల్లూరు-విశాఖపట్నం వంటి ప్రముఖ రూట్లలో బస్సు ఆపరేటర్లు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. 


సాధారణంగా ఉన్న చార్జీపై 1000 నుంచి 3వేల వరకు పెంపు


హైదరాబాద్ నుంచి వేర్వేరు ప్రాంతాలకు వెళ్లే నాన్-ఏసీ బస్సుల ఛార్జీలు వెయ్యి నుంచి 2 వేల వరకు పెంచేశారు. స్లీపర్ బస్‌ ఛార్జీలు ఇక అడగాల్సిన పనే లేదు. ఉన్న ఛార్జీల కంటే మూడు వేలకుపైనే పెంచేశారు. ఇదంతా అధికారికంగా ఆయా ఆపరేటర్ల వెబ‌్‌సైట్‌లో చూపిస్తున్న రేట్లు. వాటిని కొందరు బ్లాక్ చేసి ఆఫ్‌లైన్‌లో భారీగా వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. 


కుటుంబం వెళ్లాలంటే 10 వేలకు పైమాటే


ఇప్పుడున్న లెక్కల ప్రకారం నలుగురు ఉన్న ఫ్యామిలీ హైదరాబాద్‌ నుంచి ఏపీలో ఉన్న ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా ఛార్జీలకే 10 నుంచి 15 వేలు పెట్టాల్సి వస్తుంది. ఈ ఖర్చులు చూసిన వాళ్లంతా బెదిరిపోతున్నారు. అటు ట్రైన్స్‌కు వెళ్దామంటే సరిపడా రైళ్లు లేక జనం అవస్థలు పడుతున్నారు. 


సరిపోని బస్సులు


తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన బస్సులు కూడా సరిపడటం లేదు. వచ్చేపోయే ప్రయాణికులతో అటు రైల్వేస్టేషన్లు, బస్‌ స్టేషన్లు, ఇతర బస్టాండ్‌లు కిక్కిరిసిపోయిం ఉన్నాయి. ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి వారిని సురక్షితంగా బస్సులను ఎకిస్తున్నారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 


ట్రాఫిక్ తిప్పలు


ఏదో అప్పొసప్పో చేసి ఛార్జీలు తీసుకొని ఊరెళ్లాలంటే ఇంటి దగ్గర్నుంచే ట్రాఫిక్ ఈదుకుంటా రావాల్సి ఉంటుంది. విజయవాడ వైపు వెళ్లాల్సిన ఫ్యామిలీ ట్రావెల్స్‌లో కుకట్‌పల్లి నుంచి బయల్దేరితే ఎల్బీనగర్ వచ్చేసరికి ఒకరోజు వృథా అవుతుంది. ఇలా వెళ్లేటప్పుడు టోల్‌ గేట్‌ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. 


జర్నీకే లోనే 20 నుంచి 30 గంటల టైం వేస్ట్


అసలే సెలవులు తక్కువ ఉన్న వాళ్ల పరిస్థితి మరింత దారణంగా ఉంది. ఊరు చేరక ముందు ఒకట్రెండురోజులు వృథా పోతున్నాయని ఉద్యోగుస్తులు వాపోతున్నారు. సొంత వాహనాల్లో వెళ్లే వారి పరిస్థితి ఇంతకంటే గొప్పగా ఏం లేదు. ప్రతి టోల్ గేట్ వద్ద కూడా వాహనాలు బారులు కనిపిస్తున్నాయి. వాటి క్లియరెన్స్‌కు గంటల సమయం పడుతుంది.