Telugu Desam Party Chief Chandra Babu: నేడు సీఐడీ ఆఫీస్‌కు చంద్రబాబు- మూడు కేసుల్లో పూచీకత్తులు ఇచ్చేందుకు హాజరు

Telugu Desam Party Chief Chandra Babu: మూడు కేసుల్లో పూచీకత్తులు సమర్పించేందుకు సీఐడీ ముందు హాజరుకానున్న టీడీపీ అదినేత చంద్రబాబు

Continues below advertisement

Telugu Desam Party Chief Chandra Babu: ఇసుక, మద్యం, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ సీఐడీ ముందు హాజరుకానున్నారు. ఇప్పటికే  కేసుల్లో చంద్రబాబుకు హైకోర్టులో ఊరట లభించింది. మూడు కేసుల్లో కూడా ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. వాటికి సంబంధించిన ఫార్మాలిటీని పూర్తి చేసేందుకు చంద్రబాబు సీఐడీ ముందు హాజరుకానున్నారు. 

Continues below advertisement

చంద్రబాబుకు మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సీఐడీకి పూచీకత్తు సమర్పించాలని సూచించింది. దీంతో మూడు కేసుల్లో పూచీకత్తులు సమర్పించనున్నారు. మద్యం కేసులో గుంటూరు సీఐడీకి వెళ్లి పూచీకత్తు ఇస్తారు. అనంతరం ఇసుక కేసులో విజయవాడ సీఐడీ ఆఫీస్‌కు వెళ్లి పూచీకత్తు సమర్పిస్తారు. ఔటర్ రింగ్‌ రోడ్డు కేసులో సాయంత్రం తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి వెళ్లి పూచీకత్తు ఇస్తారు. ఆయా ఆఫీసుల్లో పూచీకత్తుతో పాటు లక్ష రూపాయల విలవైన బాండ్‌లు సమర్పించనున్నారు. 

Continues below advertisement