ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు మద్దుతుగా టీడీపీ నేతలు ఉద్యమించారు. ‘రైతు కోసం తెలుగుదేశం’ కార్యక్రమంలో భాగంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించారు. రైతుల సమస్యల పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. కృష్ణా జిల్లాలోని మైలవరం, తిరువూరు, గన్నవరం, పెనమలూరు, అవనిగడ్డ, పామర్రు, గుడ్లవల్లేరు, పెడన, జగ్గయ్యపేట, నందిగామ ప్రాంతాల్లో రైతు ప్రదర్శనలు సాగాయి. ఇక గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట, బాపట్ల, వినుకొండ, వినుకొండ, రేపల్లె, పొన్నూరు, అచ్చంపేట, సత్తెనపల్లి ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. ప్రకాశం జిల్లా అద్దంకి, పర్చూరు, సంతనూతలపాడులలో రైతుల కోసం తెలుగుదేశం నేతలు రోడ్డెక్కారు.
Also Read: నేటి నుంచి వైఎస్సార్ పెన్షన్ కానుక.. వారికి కూడా అందిస్తామన్న ప్రభుత్వం..
కృష్ణా జిల్లాలో ఇలా..
కృష్ణా జిల్లా గన్నవరంలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు నేతృత్వంలో రైతు పాదయాత్ర నిర్వహించారు. మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ర్యాలీ కొనసాగింది. అవనిగడ్డలో మాజీ ఎంపీ కొనకొళ్ల నారాయణ, తిరువూరులో నియోజకవర్గ ఇన్‌ఛార్జి దేవదత్, పెనమలూరులో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, గుడ్లవల్లేరులో రావి వెంకటేశ్వరరావు, పామర్రులో ఉప్పులేటి కల్పన, జగ్గయ్యపేటలో శ్రీరాంతాతయ్య, పెడనలో కాగిత కృష్ణప్రసాద్, నందిగామలో తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా నిరసనలు జరిగాయి.
గుంటూరు జిల్లాలో ట్రాక్టర్లపై వచ్చిన రైతులు..
గుంటూరు జిల్లా వినుకొండలో నరసరావుపేట పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, తెనాలి శ్రావణ్‌కుమార్ నేతృత్వంలో 80కిపైగా ట్రాక్టర్లపై రైతులు ర్యాలీగా తరలివచ్చారు. వేమూరులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, పొన్నూరులో మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్, రేపల్లెలో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, అచ్చంపేటలో మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, బాపట్లలో నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి నరేంద్రవర్మ, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగాయి. నరసరావుపేటలో అరవిందబాబు, సత్తెనపల్లిలో కోడెల శివరాం, మన్నెం మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి.
Also Read: మంత్రి మేకపాటి ఇలాకాలో వైసీపీ వర్సెస్ వైసీపీ.. అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు..
పర్చూరులో రోడ్డుపై బైఠాయించిన కార్యకర్తలు..
ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరు సాంబశివరావు నేతృత్వంలో ప్రకాశం జిల్లా అద్దంకి, పర్చూరులలో ర్యాలీలు సాగాయి. పర్చూరులో తమను పోలీసులు అడ్డుకున్నారని ఆరోపిస్తూ.. కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. సంతనూతలపాడు, చీరాలలోనూ టీడీపీ నేతలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
Also Read: కొత్త ప్రధాన కార్యదర్శిగా సమీర్ శర్మ బాధ్యతలు స్వీకరణ.. ఆదిత్యనాథ్ దాస్‌కు వీడ్కోలు