Russian Fighter Plane: ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. రష్యా మిలటరీ విమానం తొమ్మిది అంతస్తుల భవనంపైకి దూసుకురావడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులతో సహా 13 మంది మృతి చెందారు. 19 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఇదీ జరిగింది
రష్యాలోని యెయిస్క్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతం ఉక్రెయిన్‌కు సరిహద్దులో ఉంది. సుఖోయ్-34 విమానం మిలటరీ ఎయిర్‌ఫీల్డ్ నుంచి ప్రయాణిస్తున్న సమయంలో ఓ భవనంపైకి దూసుకెళ్లింది. దీని గురించి రష్యా రక్షణ శాఖ వివరాలు తెలిపింది.
ఉక్రెయిన్‌పై దాడులు
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు పెంచింది. కెర్చ్ ఘటన జరిగిన తరవాత పుతిన్ మరింత దూకుడు పెంచారు. ఉక్రెయిన్‌లోని కీలక ప్రాంతాలపై రష్యా సైన్యం మిసైల్స్‌తో దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే రాజధాని కీవ్‌పైనా డ్రోన్‌లతో దాడులు చేసింది. ఉక్రెయిన్ ప్రెసిడెన్సీ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. "కమికేజ్ డ్రోన్స్ (Kamikaze drones)" దాడి చేసినట్టు తెలిపింది. కీవ్‌లోని రెండు ప్రాంతాల్లో బాంబు దాడులు
జరిగాయి. "ఇలాంటి దాడులు చేయటం వల్ల తమకు ఏదో ఒరుగుతుందని రష్యా అనుకుంటోంది. కానీ...ఓడిపోతామేమోనన్న నిరాశలో ఇలాంటివి చేస్తున్నారని మాకు అర్థమవుతోంది" అని ఉక్రెయిన్ అంటోంది. ప్రస్తుతం ఉన్న సైన్యం తమకు చాలటం లేదని, రక్షణను ఇంకా పెంచుకోవాల్సి ఉందని అంటున్నారు ఉన్నతాధికారులు. "ఆలస్యం చేసేంత సమయం లేదు. ఇప్పటికిప్పుడు మాకు ఆయుధాలు కావాలి. మా గగనతలాన్ని రక్షించుకుంటూ శత్రువుని మట్టుబెట్టాలి" అని స్పష్టం చేస్తున్నారు.
Also Read: Rahul Gandhi on tanning: అమ్మ సన్‌స్క్రీన్ పంపింది- కానీ నేను వాడట్లేదు: రాహుల్ గాంధీ