Rahul Gandhi on tanning: అమ్మ సన్‌స్క్రీన్ పంపింది- కానీ నేను వాడట్లేదు: రాహుల్ గాంధీ

ABP Desam   |  Murali Krishna   |  18 Oct 2022 04:44 PM (IST)

Rahul Gandhi on tanning: భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ తన చర్మ సంరక్షణ కోసం ఎలాంటి ఉత్పత్తులు వాడటం లేదన్నారు.

(Image Source: PTI)

Rahul Gandhi on tanning: భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఉత్సాహంగా ముందుకు కదులుతున్నారు. ఎండలో కూడా రాహుల్ గాంధీ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అయితే ఈ పాదయాత్రలో తన చర్మ సంరక్షణ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నారనే విషయంపై రాహుల్ గాంధీ ఆసక్తికర సమాధానమిచ్చారు.

అమ్మ పంపింది

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికల సందర్భంగా సోమవారం భారత్ జోడో యాత్రకు రాహుల్ గాంధీ విరామం ఇచ్చారు. ఈ సందర్భంగా స్థానికులతో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆ సమయంలో రాహుల్ గాంధీతో ఓ వ్యక్తి మాట్లాడుతూ, యాత్రలో చర్మం నల్లబడకుండా ఎలా కాపాడుకుంటున్నారు? అని ప్రశ్నించారు. ఏ సన్‌స్క్రీన్ లోషన్‌ వాడుతున్నారు? అని అడిగారు. అప్పుడు రాహుల్ స్పందిస్తూ, తాను ఎటువంటి చర్మ రక్షణ సాధనాలను వాడటం లేదన్నారు.

మా అమ్మ సన్‌స్క్రీన్‌ను పంపించారు. అయితే దానిని నేను వాడటం లేదు.                         -    రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

ఈ వీడియోను కాంగ్రెస్ నేత సుప్రియ భరద్వాజ్ ట్వీట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తన మృదువైన చర్మం కమిలిపోయి, నల్లబడటాన్ని నివారించగలిగే సన్‌స్క్రీన్ లోషన్‌ను వాడటం లేదు. ఆయనకు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ సన్‌స్క్రీన్ లోషన్‌ను పంపినప్పటికీ దానిని ఆయన ఉపయోగించడం లేదు.                                                 - సుప్రియ భరద్వాజ్, కాంగ్రెస్ నేత

కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతోంది. ఇప్పటికే కేరళ, తమిళనాడులో ఈ యాత్రకు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం కర్ణాటకలో కూడా యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ.. కార్యకర్తలు, అభిమానులకు ఉత్సాహం నింపుతూ ముందుకు సాగుతున్నారు. ఇటీవల రాహుల్ గాంధీ.. కర్ణాటకలో రోడ్డుపై పుష్‌ అప్‌లు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: Jayalalithaa Death Case: జయలలిత మృతి కేసులో శశికళపై డౌట్స్- దర్యాప్తు నివేదికలో సంచలన విషయాలు!

Published at: 18 Oct 2022 04:39 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.