Russia Ukraine War:
న్యూక్లియర్ ప్లాంట్‌పై దాడులు..
ఉక్రెయిన్ విషయంలో రష్యా వ్యవహరిస్తున్న తీరుపై ఐక్యరాజ్య సమితి మండి పడుతోంది. అణుదాడులు జరగకుండా నియంత్రించే ఐరాస అనుబంధ సంస్థ చీఫ్ రఫేల్ గ్రాస్సి రష్యాపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌లో రష్యా అధీనంలో ఉన్న జపోరిరియా ప్రాంతంలో న్యూక్లియర్ ప్లాంట్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంపై విమర్శలు చేశారు. "ఇలాంటి పిచ్చి పనులు మానుకోండి" అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. "ఆ న్యూక్లియర్ ప్లాంట్‌పై దాడి జరిగిందని తెలిసినప్పటి నుంచి చాలా ఆందోళన కలుగుతోంది. ఇలాంటి భారీ ప్లాంట్‌లపై బాంబు దాడులు చేయడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. దీని వెనక ఎవరున్నా సరే..వెంటనే ఈ పని మానుకోవాలి" అని హెచ్చరించారు రఫేల్ గ్రాసీ. అంతే కాదు. నిప్పుతో చెలగాటం ఆడుతున్నారంటూ విమర్శించారు. అంతర్జాతీయ మీడియా అందిస్తున్న సమాచారం ప్రకారం...ఆ న్యూక్లియర్ ప్లాంట్‌పై ఒక్క రోజులోనే 12 కంటే ఎక్కువ సార్లు దాడులు జరిగినట్టు తెలుస్తోంది. నిపుణుల బృందాన్ని ఘటనా స్థలానికి పంపిన ఐరాస...ఇవి అనుకోకుండా జరిగిన ప్రమాదాలు కాదని తేల్చి చెప్పింది. "ఈ దాడులు చేస్తున్న వాళ్లెవరైనా సరే. ఎక్కడ దాడి చేస్తున్నాం అనే విషయాన్ని గమనించుకోవాలి. ఇది కావాలని చేస్తున్న పనే" అని గ్రాసీ అన్నారు. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (IAEA) కూడా నిపుణుల బృందాన్ని ఘటనా స్థలానికి పంపనుంది. ఐరోపాలోనే అతి పెద్ద న్యూక్లియర్ ప్లాంట్‌ను ప్రస్తుతం రష్యన్ సైనిక దళాలు తమ అధీనంలో ఉంచుకున్నాయి. ఇక రష్యా..ఉక్రెయిన్‌పై మరో ఆరోపణతో ముందుకొచ్చింది. లొంగిపోయిన రష్యా సైనికులను కావాలనే దారుణంగా చంపుతున్నారని విమర్శించింది. "వార్ క్రైమ్"కు పాల్పడుతోందని మండి పడింది. ఉక్రెయిన్ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది.
ఓడినట్టా..?
ఉక్రెయిన్‌లోని ఖేర్సన్ నుంచి రష్యా బలగాలు వెనక్కి వెళ్లిపోవడాన్ని ఏ దేశమూ ఊహించలేదు. అప్పటికే...రష్యాపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఆ దేశ సైనికులూ భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా...పుతిన్ ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు. అయితే...పుతిన్ నిర్ణయాన్ని ఓటమిగా భావించవచ్చని అంటోంది ఓ నివేదిక. రష్యన్ ఇండిపెండెంట్ న్యూస్ మ్యాగజైన్ "Meduza"లో రష్యా సైనికుల ఉపసంహరణపై వచ్చిన వార్తలు అదే సూచిస్తున్నాయి. "చాలా బాధాకర" స్థితిలో రష్యా ఈ నిర్ణయం తీసుకుందని అందులో పేర్కొంది. "ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఒకటి స్పష్టంగా అర్థమవుతోంది. యుద్ధంలో మేం ఓడిపోతున్నామనటానికి ఇది సంకేతం కావచ్చు. రష్యా సైనికులు ఉక్రెయిన్‌లో ఎలా మనుగడ సాగించాలో ఆలోచిస్తున్నారు. ఏ ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకోవాలి..? ఎంత వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలి..? అని ఆలోచిస్తున్నారు. మరో వైపు...పరిస్థితులు సాధారణ స్థితికి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి" అని ఆ మ్యాగజైన్ వెల్లడించింది. అయితే..పుతిన్ ఇంకా నమ్మకం కోల్పోలేదని...ఉక్రెయిన్‌లో తనకు అనకూల అధ్యక్షుడు అధికారంలోకి వస్తే ఉక్రెయిన్‌ను సులువుగా హస్తగతం చేసుకోవచ్చని భావిస్తున్నారని తెలిపింది.
Also Read: Russia Ukraine War: ఉక్రెయిన్‌కు పెరుగుతున్న సపోర్ట్, పుతిన్ ఇకనైనా తగ్గుతారా..?