Russia Ukraine War:
మిలిటరీ సాయం..
రష్యా ఆక్రమణకు గురవుతున్న ఉక్రెయిన్‌కు ప్రపంచ దేశాల మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే...అగ్రరాజ్యం అమెరికా అండగా నిలవగా... ఇప్పుడు బ్రిటన్ కూడా సపోర్ట్ చేస్తోంది. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఉక్రెయిన్‌కు వెళ్లి మరీ "మిలిటరీ సాయం" చేస్తానని హామీ ఇచ్చారు. బ్రిటన్‌తో పాటు పలు కీలక దేశాలు ఉక్రెయిన్‌కు సపోర్ట్ చేసేందుకు ముందుకొస్తున్నాయి. అమెరికా, ఫ్రాన్స్, కెనడా ఇప్పటికే...సైనిక సహకారం అందిస్తున్నాయి. ఆర్థిక సాయమూ చేస్తున్నాయి. అందరి కన్నా ముందుగా స్పందించి ఉక్రెయిన్‌కు ధైర్యమిచ్చింది మాత్రం అమెరికా
అధ్యక్షుడు జో బైడెన్. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలైన మొదటి రోజు నుంచే...అమెరికా అన్ని విధాలా సహకరిస్తోంది. నిజానికి... అమెరికా, రష్యా మధ్య సంబంధాలు ఎప్పుడూ అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఉక్రెయిన్‌కు అమెరికా అండగా నిలవడానికి ఇది కూడా ఓ కారణమే. ఎన్నో సందర్భాల్లో పుతిన్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు బైడెన్. ఉక్రెయిన్ పౌరులకు మద్దతుగా మాట్లాడారు. కొన్ని రిపోర్ట్‌లు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే...అమెరికా 1 బిలియన్ డాలర్లకుపైగా ఉక్రెయిన్‌కు సహకారం అందించేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఫ్రాన్స్, కెనడా కూడా..
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయేల్ మేక్రాన్ కూడా ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తామని ప్రకటించారు. ఫోన్‌లో చాలా సార్లు జెలెన్‌స్కీతో మాట్లాడారు కూడా. ఉక్రెయిన్‌పై చేపడుతున్న రష్యా సైనిక చర్యను"సామ్రాజ్యవాద కాంక్ష" అంటూ ఎన్నోసందర్భాల్లో మండి పడ్డారు. ఈ విషయంలో మౌనంగా ఉన్న వాళ్లు...రష్యాకు మద్దతు తెలుపుతున్నట్టే అని తేల్చి చెప్పారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన శాంతి సూత్రాలను..
ఇలాంటి యుద్ధాలు...బలహీన పరుస్తున్నాయని చెప్పారు. "ఫ్రాన్స్ కూడా ఉక్రెయిన్‌కు మిలిటరీ సాయం తప్పకుండా చేస్తుంది" అని హామీ ఇచ్చారు. కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో అర బిలియన్ డాలర్ల నిధులను ఉక్రెయిన్‌కు అందజేస్తామని హామీ ఇచ్చారు. మిలిటరీ అసిస్టెన్స్‌కి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. "పాశ్యాత్య దేశాలు ఈ విషయంలో ఎంత బలంగా నిలబడుతున్నాయో పుతిన్ అర్థం చేసుకోవాలి" అని వ్యాఖ్యానించారు జస్టిన్ ట్రూడో. అటు జర్మనీ కూడా పెద్ద ఎత్తున ఉక్రెయిన్‌కు సైనిక సాయం అందిస్తోంది. 1000 యుద్ధ ట్యాంక్‌లు, 500 వరకూ క్షిపణులు అందించింది. నిజానికి...జర్మనీ ఇన్నాళ్లు ఓ నిబంధనను చాలా కచ్చితంగా పాటించింది. రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు, ఏ దేశానికీ ఆయుధాలు ఎగుమతి చేయకూడదని నిర్ణయించుకుంది. కానీ...ఉక్రెయిన్ విషయంలో మాత్రం ఆ లెక్కలన్నీ పక్కన పెట్టేసింది. "ఉక్రెయిన్‌కు మద్దతునివ్వడం మా కనీస బాధ్యత" అని జర్మనీ వైస్ ఛాన్స్‌లర్ ఒలాఫ్ స్కోల్జ్ వెల్లడించారు.
రష్యాపై ఆస్ట్రేలియా గుర్రు..
రష్యా అధ్యక్షుడు పుతిన్ తీరుపై గుర్రుగా ఉంది ఆస్ట్రేలియా. పుతిన్ పదేపదే అణు బాంబుల బెదిరింపులు చేయడంపైనా మండి పడుతోంది. "ఇలాంటి హెచ్చరికలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కావు. ఇంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం సరికాదు. రష్యా భూభాగాలు కాపాడుకోటానికే ఈ సైనిక చర్య అని చెప్పే మాటల్లో నిజం లేదు" అని అసహనం వ్యక్తం చేసింది ఆస్ట్రేలియా.
Also Read: Trump Twitter Account: డొనాల్డ్ ట్రంప్ ఈజ్ బ్యాక్! ఇక ట్విట్టర్ మోత మోగిపోద్ది!