Vijaya Shanthi on TRS: తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ నాయకురాలు విజయ శాంతి ఘాటు విమర్శలు చేశారు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడి చేయాడాన్ని తీవ్రంగా ఖండించారు. విమర్శిస్తే కొట్టి చంపుతామని చెప్పడం ఏంటంటూ ప్రశ్నించారు. కేసీఆర్ పది తలల రావణాసురుడు అంటూ మండి పడ్డారు. మీ బిడ్డలు మాట్లాడిన మాటలు, వీధి రౌడీల మాటలు ఒకేలా ఉన్నాయంటూ ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ కవిత పార్టీ మార్పుపై ముందుగా మాట్లాడింది సీఎం కేసీఆర్ యేనా కాదా అని ప్రశ్నింటారు. కేసీఆర్ కుటుంబం నోరు, ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని అన్నారు. సీఎం కేసీఆర్.. ముఖ్యమంత్రిగా ఏ రోజూ రాష్ట్రానికి మంచి చేయలేదని అన్నారు. 


ఈ క్రమంలోనే శనివారం రోజు ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటకి వెళ్లి విజయశాంతి ఆయనను పరామర్శించారు. అర్వింద్ తో పాటు వాళ్ల అమ్మతో కూడా కాసేపు ముచ్చటించారు.  






నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్‌ఎస్‌ శ్రేణులు దాడి చేసిన ఘటనను తెలంగాణ గవర్నర్‌ తమిళిసై తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలలో ఇలాంటి దాడులకు అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. అసలు ఏం జరిగిందో చెప్పాలంటూ డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. ఓ ఎంపీ ఇంటిపై దాడి చేసి భయభ్రాంతులకు గురి చేసిన సంఘటనపై సమగ్ర విచారణ జరపాలని సూచించారు. ఎంపీ ఇంటిపై దాడి చేయడమే కాకుండా అక్కడ ఉండే వారిని బెదిరించడం భయపెట్టడాన్ని ఆమె ఖండించారు. 


ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి..


బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి కేసులో 8 మంది టిఆర్ఎస్ కార్యకర్తలని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఉన్న ఇంటిపై శుక్రవారం దాడి జరిగింది. ఆ సమయంలో ఎంపీ ఇంట్లో లేరు. ఈ దాడిలో ఇంట్లో ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ కారణంగా అక్కడ కాసేపు ఉద్రిక్తత వాతావరణ నెలకొంది. భారీగా అక్కడకు చేరుకున్న టీఆర్‌ఎస్‌ నాయకులు కార్యకర్తలతో అదుపు చేయడం క్షష్టంగా మారింది. అక్కడకి చేరుకొని బీజేపీకి, ఎంపీ అరవింద్ కు వ్యతిరేక నినాదాలు నినాదు చేస్తూ ఇంటి అద్దాలు పగులగొట్టారు. దీనిపై ధర్మపురి అరవింద్, ఆయన తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు పై టీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేసిన పోలీసులు.. 8 మంది అరెస్ట్ చేశారు. ఐపీసీ 452,148,427,323,354, r/w 149 సెక్షన్ల కింద దాడి చేసిన వారిపై కేసు నమోదైంది. అరెస్ట్ చేసిన వారిని నేటి రాత్రి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు పోలీసులు.


కాంగ్రెస్ లో చేరతారని ప్రచారంపై వివాదం.. 


కాంగ్రెస్‌లో చేరేందుకు ఎమ్మెల్సీ కవిత ప్రయత్నిస్తున్నారని నిజామాబాద్ ఎంపీ చేసిన కామెంట్స్‌తో ఈ చిచ్చు రేగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు ఫోన్ చేసిన కవిత... తాను పార్టీలో చేరుతానంటూ చెప్పారని అర్వింద్ నిన్న కామెంట్ చేశారని ప్రచారం జరిగింది. దీనిపై టీఆర్‌ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. సీఎం కేసీఆర్ కుటుంబం కుల అహంకారంతో మిడిసిపడుతోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతతో టచ్ లో ఉన్నారని ఆ పార్టీ సీనియర్ ఆఫీస్ బేరర్ చెప్పారని ఆ మాటకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.  కేసీఆర్, కేటీఆర్, కవిత ఆదేశాలతోనే తన ఇంటిపై టీఆర్ఎస్ గూండాలు దాడి చేశారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌లోని అర్వింద్ ఇంటిపై దాడి చేయడం..తర్వాత కవిత చెప్పుతో కొడతానని హెచ్చరించిన తర్వాత ఆయన నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. కవితపై తానేం అసభ్యకరంగా మాట్లాడలేదన్నారు. అసత్య ప్రచారం చేయలేదన్నారు. కాంగ్రెస్‌లో చేరేందుకు ఖర్గేను, కవిత కలిసిందని తాను చెప్పలేదని స్పష్టం చేశారు.