Zelenskyy On US Aid:


అమెరికాకు జెలెన్‌స్కీ 


ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అమెరికా కాంగ్రెస్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని సవాళ్లను ఎదుర్కొని నిలబడతామని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌కు అమెరికా మొదటి నుంచి అండగా ఉంటోంది. ఈ విషయమై అగ్రరాజ్యానికి థాంక్స్ చెప్పేందుకు వచ్చారు జెలెన్‌స్కీ. "యుద్ధాన్ని ఆపే విషయంలో ఏ విధంగానూ రాజీ పడం" అని తేల్చి చెప్పారు. ఉక్రెయిన్‌కు సైనిక పరంగా సహకరించాలని అమెరికాను కోరారు. ఇప్పటికే అమెరికా ఉక్రెయిన్‌కు సైనిక సహకారం అందిస్తోంది. కీలకమైన ఆయుధాలను ఉక్రెయిన్‌కు చేరవేస్తోంది. రష్యాకు వ్యతిరేకంగా పోరాడడంలో అన్ని విధాలా సాయ పడుతోంది. ఇదే విషయాన్ని మరోసారి జెలెన్‌స్కీ  స్పష్టం చేశారు. బిలియన్ల డాలర్ల కొద్దీ ఉక్రెయిన్‌ కోసం అమెరికా ఖర్చు చేసిందని గుర్తు చేశారు. దాదాపు ఏడాదిగా ఖర్చుకు వెనకాడకుండా ఉక్రెయిన్‌కు అండగా నిలబడుతోందని అన్నారు. ఈ సందర్భంగా అమెరికాను ఉద్దేశిస్తూ  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "మీరు (అమెరికా) ఇచ్చే డబ్బుని విరాళంగా భావించడం లేదు. అంతర్జాతీయ భద్రతను పెంచేందుకు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు మీరు పెట్టే పెట్టుబడి అది. మేం వాటిని సద్వినియోగం  చేసుకున్నాం" అని అన్నారు జెలెన్‌స్కీ. ఉక్రెయిన్ అధ్యక్షుడికి బైడెన్ మర్యాదపూర్వక స్వాగతం పలికారు. అమెరికా సైనిక సహకారం కొనసాగిస్తుందని హామీ ఇచ్చారు. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని నిర్మూలించి శాంతి నెలకొల్పుతామని చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్‌పై సైనిక చర్య మొదలు పెట్టినప్పటి నుంచి జెలెన్‌స్కీ దేశం దాటి వెళ్లలేదు. ఇన్నాళ్లకు అమెరికా వచ్చారు. ఇదే తొలి అధికారిక పర్యటన. వచ్చే ఏడాది యుద్ధం కీలక మలుపు తిరిగే అవకాశముందని జోస్యం చెప్పారు జెలెన్‌స్కీ. రష్యాకు ఉక్రెయిన్‌ ఎప్పుడూ సరెండర్ అవ్వదని తేల్చి చెప్పారు. 


అంతర్జాతీయ మద్దతు..


రష్యా ఆక్రమణకు గురవుతున్న ఉక్రెయిన్‌కు ప్రపంచ దేశాల మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే...అగ్రరాజ్యం అమెరికా అండగా నిలవగా... ఇప్పుడు బ్రిటన్ కూడా సపోర్ట్ చేస్తోంది.  బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఉక్రెయిన్‌కు వెళ్లి మరీ "మిలిటరీ సాయం" చేస్తానని హామీ ఇచ్చారు. 
బ్రిటన్‌తో పాటు పలు కీలక దేశాలు ఉక్రెయిన్‌కు సపోర్ట్ చేసేందుకు ముందుకొస్తున్నాయి. అమెరికా, ఫ్రాన్స్, కెనడా ఇప్పటికే...సైనిక సహకారం అందిస్తున్నాయి. ఆర్థిక సాయమూ చేస్తున్నాయి. అందరి కన్నా ముందుగా స్పందించి ఉక్రెయిన్‌కు ధైర్యమిచ్చింది మాత్రం అమెరికా
అధ్యక్షుడు జో బైడెన్. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలైన మొదటి రోజు నుంచే...అమెరికా అన్ని విధాలా సహకరిస్తోంది. నిజానికి... అమెరికా, రష్యా మధ్య సంబంధాలు ఎప్పుడూ అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఉక్రెయిన్‌కు అమెరికా అండగా నిలవడానికి ఇది కూడా ఓ 
కారణమే. ఎన్నో సందర్భాల్లో పుతిన్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు బైడెన్. ఉక్రెయిన్ పౌరులకు మద్దతుగా మాట్లాడారు. కొన్ని రిపోర్ట్‌లు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే...అమెరికా 1 బిలియన్ డాలర్లకుపైగా ఉక్రెయిన్‌కు సహకారం అందించేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. 


Also Read: China Covid-19 Surge: చైనాలో నిమ్మకాయలకు పెరిగిన డిమాండ్, మార్కెట్‌లలో తోపులాటలు