ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు విషయంలో ముఖ్యమంత్రి జగన్ వెనక్కి తగ్గబోరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. అధికారంలోకి వస్తే వారంలోనే సీపీఎస్ రద్దు చేస్తామని జగన్ హామీ ఇచ్చారని మా ముఖ్యమంత్రి జగన్ మాట ఇస్తే తప్పడని ఆయన ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టి చెప్పారు. ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలన్నదే జగన్ విధానం అని స్పష్టం చేశారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ లేదని హైకోర్టు ఇచ్చిన తీర్పుపైనా స్పందించారు. ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా ఏదో జరిగిపోయినట్లుగా కేసులు పెట్టారని .. ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.


అదే సమయంలో హైకోర్టుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై సీబీఐ నమోదు చేస్తున్న కేసులపై కూడా మాట్లాడారు. లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వైసీపీ కార్యకర్తపై సీబీఐ చార్జిషీట్ నమోదు చేసిందని.. త్వరలోనే ఈ కేసుల్లో ఉన్న 90మందిపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. అదే సమయలో గతంలో  సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను నిందిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కు చెందిన సాక్షి దినపత్రిలో వచ్చిన ఓ ఆర్టికల్‌ను రఘురామకృష్ణరాజుప్రదర్శించారు. అందులో ప్రత్యేకంగా కొంత మంది న్యాయమూర్తుల పేర్లు పెట్టి మరీ కథనం రాశారని.. అది కచ్చితంగా న్యాయవ్యవస్థను బ్లాక్ మెయిల్ చేయడం అవుతుందన్నారు. సీఎం జగన్ రాసిన లేఖను బయట బట్టి సలహాదారు ్జేయకల్లాంతో పాటు మరికొందరు వ్యాఖ్యలు చేశారని రఘురామ గుర్తుచేశారు. సాక్షి పత్రికతో పాటు వారిపైనా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టు తీర్పులను సాక్షి పత్రిక ముందే చెబుతోందని.. దానిపై విచారణ జరిపించాలని పిటిషన్ వేస్తానని ప్రకటించారు. 


Also Read : "ఉమ్మి" వివాదంలో పురందేశ్వరి


మరో వైపు విశాఖలో అక్రమాల్లేవని.. తన పేరు చెప్పి ఎవరైనా కబ్జాలకు పాల్పడితే ఊరుబోనన్న ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటనపైనా రఘురామకృష్ణరాజు సెటైర్లు వేశారు. విజయసాయిరెడ్డి రెండు టోల్ ఫ్రీ నెంబర్లు పెడతానన్నారని.. ఆ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదులు చేసే వారికి భద్రత ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. గతంలో ఇలా ఫోన్ నెంబర్లుకాల్ చేసి చెప్పిన వారిపై జరిగిన దాడుల ఘటనలను రఘురామకృష్ణరాజు ప్రస్తావించారు. విశాఖలో జరుగుతున్న కబ్జా వ్యవహారాలతో విజయసాయిరెడ్డికి సంబంధం లేకపోతే ఎవరు చేస్తున్నారో తేలాల్సి ఉందన్నారు.


Also Read : వైఎస్ సంస్మరణకు రాని ఆత్మీయులు


ఏపీలో వృద్ధుల పెన్షన్లకు కోత వేయడంపైనా మండిపడ్డారు. అనర్హలకు ఇవ్వాలా అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను రఘురామకృష్ణరాజు తప్పు పట్టారు. వృద్ధుల విషయంలో అలాంటి మాటలు మాట్లాడకూడదన్నారు. ప్రభుత్వం వద్ద డబ్బులు లేకపోతే చేతులెత్తేయాలని కానీ వృద్ధులపై నిందలేయకూడదన్నారు. పక్క రాష్ట్రాల్లో ఉన్నారని ఇప్పుడే తెలిసిందా అని ప్రశ్నించారు. వారికి ఏపీలో ఓటు ఉందో లేదో చూసుకునే పెన్షన్ ఇచ్చారని గుర్తు చేశారు. వాలంటీర్ వ్యవస్థ అవినీతి మయం అయిపోయిందన్నారు. ప్రభుత్వ విధానాలపై రోజువారీ విమర్శలు చేస్తున్న రఘురామకృష్ణరాజు.. ప్రధాన సమస్యలన్నింటిపై ప్రభుతవంపై విరుచుకుపడుతున్నారు. అయితే అవి రాజకీయ విమర్శలుగా కాకుండా మా ప్రభుత్వం.. మా ముఖ్యమంత్రి అంటూనే వివరాలన్నీ వెల్లడిస్తూ ఉంటారు.


Also Read : ఏపీలో సామాజిక పెన్షన్లు తగ్గిస్తున్నారా..? ఇదిగో నిజాలు