Republic Day 2024 LIVE Updates: కర్తవ్యపథ్‌లో కాసేపట్లో గణతంత్ర వేడుకలు - ఢిల్లీ మొత్తం హైఅలర్ట్!
Republic Day 2024 LIVE Updates: రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా నిర్వహించనున్న కవాతు వీక్షించేందుకు సుమారు 77 వేల మంది రానున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు.
Background
Republic Day Celebrations in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ డే వేడుకలను పటిష్ట భద్రత నడుమ నిర్వహించనున్నారు. ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా నిర్వహించనున్న కవాతు వీక్షించేందుకు సుమారు 77 వేల మంది రానున్నారని...More
ఈసారి గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాయుధ దళాలకు చెందిన 80 మంది సైనికులను శౌర్య పురస్కారాలతో సత్కరించనున్నారు. వీరిలో 12 మందికి మరణానంతరం ఈ గౌరవం దక్కనుంది. 80 శౌర్య పురస్కారాల్లో 6 కీర్తి చక్ర, 16 శౌర్య చక్ర, 53 సేన పతకాలు, 1 నేవీ మెడల్, 4 వాయుసేన పతకాలు ఉన్నాయి. గాలంట్రీ అవార్డులతోపాటు 311 డిఫెన్స్ డెకరేషన్స్ కూడా ఇచ్చారు. వీటిలో 31 పరమ విశిష్ట సేవా పతకాలు, 4 ఉత్తమ్ యుద్ధ సేవా పతకాలు, 2 అతి విశిష్ట సేవా పతకాలు, 59 అతి విశిష్ట సేవా పతకాలు, 10 యుద్ధ సేవా పతకాలు, 8 సేన మెడల్ బార్, 38 సేన పతకాలు, 10 నేవీ పతకాలు, 14 వాయుసేన పతకాలు, 5 విశిష్ట సేవా పతకాలు ఉన్నాయి.