ఆంధ్రప్రదేశ్లో ఇప్పట్లో కొత్త జిల్లాల ఏర్పాటు ఉండదని కూటమి ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. జిల్లాల పున:వ్యవస్థీకరణపై ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు శాసనమండలిలో సమాధానం ఇచ్చారు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ర్టేషన్, స్టాంప్స్ శాఖల మంత్రి అనగాని సత్యప్రసాద్. 
ప్రస్తుతం జిల్లాల పునర్నిర్మాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ పరిశీలనలో ఎటువంటి ప్రతిపాదనలు లేవని స్పష్టం చేసారు. బాపట్ల, చీరాల మరియు రేపల్లె అనే మూడు రెవెన్యూ డివిజన్లను సవరించి, అద్దంకి కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం బాపట్ల జిల్లా కలెక్టర్ నుండి ప్రతిపాదన వచ్చిందని అదేవిధంగా, మడకశిరను కొత్త రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనను శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి సమర్పించారని తెలిపారు. ఈ రెండు ప్రతిపాదనలు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయన్నారు. అలాగే ఎమ్మిగనూర్, ఉదయగిరిలను రెవెన్యూ డివిజన్లుగా మార్చాలని స్థానిక శాసనసభ్యులు కోరినట్లు కూడా మంత్రి స్పష్టం చేసారు.

Continues below advertisement



వైసీపీ తీసుకొచ్చిన క్రొత్త జిల్లాల ఏర్పాటు గజిబిజిగా ఉంది: ఏపీ ప్రభుత్వం 


 గత వైసీపీ ప్రభుత్వం 2022లో అశాస్తీమాయంగా చేసిన జిల్లాల పున:వ్యవస్తీకరణ కారణంగా  చాలా సమస్యలు తలెత్తాయన్నారు మంత్రి అనగాని సత్య ప్రసాద్.  కొత్త జిల్లాల్లో మౌలిక వసతులను ఏర్పాటు చేయలేకపోయారని, వాటన్నింటినీ తాము సరిదిద్దుతున్నామని చెప్పారు.


ఆ మూడు జిల్లాలు ఇప్పట్లో లేనట్టే 


 గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ లో  మరో మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఎన్నికల సమయంలో  చంద్రబాబు సైతం ఆమెకు హామీ ఇచ్చారు. రంప చోడవరం నుండి జిల్లా కేంద్రం పాడేరు వరకూ వెళ్లాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న అల్లూరి సీతారామరాజు జిల్లా నుండి రంప తదితర ప్రాంతాలనః వేరు చేసి క్రొత్త జిల్లా, హిందూపూర్ కేంద్రం గా మరో జిల్లా, మార్కాపురం జిల్లా లు ఏర్పాటు చెయ్యాలని అక్కడి ప్రజలనుండి చాలా ఒత్తిడి ఉంది. ఈ మూడు జిల్లాలతో పాటు  రాజధాని అమరావతి ని సెపరేట్ గా ఒక జిల్లా గా మార్చాలనే ప్రతిపాదన కూడా ఈ మధ్య ఊపందుకుంటుంది. దానితో ఏపీ లో జిల్లాల సంఖ్య 26 నుండి 30 కి చేరుకుంటుంది అని అంతా భావించారు.


తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రస్తుతానికి అలాంటి ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిధి లో లేదని తేల్చేశారు. మరి భవిష్యత్తు లో అలాంటి నిర్ణయం ఏదైనా తీసుకుంటారేమో చూడాలి. మిగిలిన జిల్లాల మాటెలా ఉన్నా అల్లూరి జిల్లా గిరిజనులు మాత్రం జిల్లా కేంద్రం పాడేరు కు చేరుకోవాలంటే అడవి మార్గం లో 180 కిమీ ప్రయాణించాల్సి వస్తోంది. వారానికి రెండు రోజులు కలెక్టర్ రంపచోడవరంలో బస చేస్తున్నా తమకంటూ ఒక ప్రత్యేక జిల్లా ఉండాలనేది అక్కడి గిరిజనుల నుండి డిమాండ్ వస్తోంది.