Rajasthan News: రాజస్థాన్‌లోని ఓ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి.
ఇదీ జరిగింది
సికార్ జిల్లాలోని ఖాతూ శ్యామ్ జీ ఆలయంలో సోమవారం ఉదయం జాతర సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకే ఖాతూ శ్యామ్ జీ ఆలయాన్ని తెరిచారు. ఆలయ దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. దీంతో ఆలయ ప్రవేశ ద్వారం వద్ద భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది.
ఈ తొక్కిసలాటలో ముగ్గురు మహిళా భక్తులు మరణించారు. తొక్కిసలాటలో గాయపడిన భక్తులను జైపుర్ ఆసుపత్రికి తరలించారు.
ప్రధాని సంతాపం
తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
ఈ ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కూడా స్పందించారు. ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 16 వేల కరోనా కేసులు- 41 మంది మృతి