Corona Cases: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 16,167 కరోనా కేసులు నమోదయ్యాయి. 41 మంది మృతి చెందారు.
తాజాగా 15,549 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.50 శాతానికి చేరుకుంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.31 శాతంగా ఉన్నాయి. పాజిటివిటీ రేటు 6.14 శాతంగా నమోదైంది.
- మొత్తం మరణాలు: 5,26,730
- మొత్తం కేసులు: 4,41,61,899
- యాక్టివ్ కేసులు: 1,35,510
- మొత్తం రికవరీలు: 4,34,99,659
వ్యాక్సినేషన్
దేశంలో కొత్తగా 34,75,330 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 206.56 కోట్లు దాటింది. మరో 2,63,419 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
కరోనా ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే పలు రిపోర్ట్‌లు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో భారత్‌లో కూడా ఫోర్త్ వేవ్ వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కరోనా నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని కేంద్రం.. రాష్ట్రాలను ఆదేశించింది. కరోనా టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని కోరింది. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రామాన్ని కూడా వేగంగా కొనసాగించాలని నిర్ణయించింది కేంద్ర ఆరోగ్య శాఖ. వ్యాక్సినేషన్‌లో ఇటీవల కొత్త మైలురాయిని చేరింది భారత్. దేశవ్యాప్తంగా 200 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.
క్రితం రోజు
దేశంలో ఆదివారం 18,738 కరోనా కేసులు నమోదయ్యాయి. 40 మంది మృతి చెందారు. పాజిటివిటీ రేటు 5.02 శాతంగా నమోదైంది. కొవిడ్ నుంచి 18,558 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.50 శాతానికి చేరుకుంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.31 శాతంగా ఉన్నాయి.
Also Read: ప్రధాని మోదీకి పాకిస్థాన్‌లో ఓ సిస్టర్ ఉంది, రాఖీ కూడా పంపింది