Registration at an Employment Exchange: ఉపాధి కల్పన కార్యాలయాల్లో 54 ఏళ్ల వరకు పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఈ మేరకు ఉపాధి కల్పన కార్యాలయాల ద్వారా ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ఉపాధి కల్పన కార్యాలయాల్లో పేర్ల నమోదుకు జీవో నం.193 (27.06.1994)లో ప్రభుత్వం సవరణలు చేసింది.


14 నుంచి 54 ఏళ్లలోపు వారికి ఛాన్స్ 
తాజా సవరణల ప్రకారం.. గతంలో ఉపాధి కల్పన కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకునేందుకు జులై 1 నాటికి 14 ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు వయసు ఉండాలి. తాజా సవరణ మేరకు పుట్టిన తేదీ నాటికి 14 నుంచి 54 ఏళ్లలోపు ఉండాలి.


రెన్యూవల్ లేకుండా పర్మినెంట్‌గా 
ఒకసారి పేరు నమోదు చేసుకున్న తరువాత ప్రతి మూడేళ్లకోసారి పేరును రిజిస్టరులో పునరుద్ధరించుకోవాల్సి వచ్చేది. ఇక నుంచి పుట్టిన తేదీ ప్రామాణికంగా 54 ఏళ్లు వచ్చే వరకు ఆ అభ్యర్థి పేరు, ఉపాధికార్డు రిజిస్టరులో కొనసాగుతుంది.


ఉపాధి కల్పన కార్డులో పేర్కొన్న తేదీన కార్డును పునరుద్ధరించుకోవాలి. పునరుద్ధరణకు ఏడాది గ్రేస్ పీరియడ్ ఉంటుంది. అభ్యర్థికి 54 ఏళ్లు దాటిన తరువాత ప్రతి మూడేళ్ల కోసారి 65 ఏళ్ల వయసు వచ్చే వరకు కార్డును పునరుద్ధరించుకోవచ్చు. 65 ఏళ్లు దాటిన వెంటనే అభ్యర్థిపేరు ఉపాధి కల్పన లైవ్ రిజిస్టరు నుంచి తొలగిస్తారు.


నిరుద్యోగ  యువతకు  ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వారికి సహాయం చేయడానికి జిల్లా ఉపాధి కల్పన శాఖలు  పని చేస్తాయి. వారి విద్యార్హతలు, వయస్సు, కులం మరియు నమోదు సీనియారిటీల ఆధారంగాఆన్ లైన్ లో వివరాలు నమోదు చేయబడతాయి.


అన్ లైన్ రిజిస్ట్రేషన్:


జనవరి నుంచి 2018 వరకు ఉపాధి రిజిస్ట్రేషన్లు మరియు పునరుద్ధరణలు అదనపు అర్హతలుతో ఆన్లైన్ పోర్టల్లో మాత్రమే పనిచేయును.


ఎక్స్ఛేంజ్ కార్యకలాపాలు :



  1. రిజిస్ట్రేషన్, ఆన్ లైన్ లో ఉద్యోగ కార్డుల పునరుద్ధరణ మరియు నిర్వహణ (www.employment.telangana.gov.in).

  2. నిరుద్యోగులైన యువతమరియు సంస్థల డేటా నిర్వహణ.

  3. నిరుద్యోగ యువతకు మరియు విద్యార్థులకు వృత్తి మార్గదర్శకత్వం ఇవ్వడం.

  4. ఉద్యోగ మెలాస్ నిర్వహించడం మరియు ప్రైవేటు రంగంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించడం.

  5. PMKVY కేంద్రాలతో సహా పాఠశాలలు మరియు కళాశాలల్లో కెరీర్ చర్చలు నిర్వహించడం.

  6. PMKVY కేంద్రాల ప్రాథమిక ధృవీకరణ మరియు PMKVY సెంటర్ తనిఖీ.


Website


GUIDELINES TO EMPLOYMENT EXCHANGES IN TELANGANA


Also Read:


Scholarships: ‘మైనార్టీ’ ఉపకార వేతనాలకు దరఖాస్తులు, చివరితేది ఇదే!


CUET - UG 2022: రద్దయిన సీయూఈటీ-యూజీ పరీక్షలు ఎప్పుడంటే?


బీసీ విద్యార్థులకు గుడ్‌న్యూస్, పీఎం యశస్వీ స్కాలర్‌షిప్ దరఖాస్తులు షురూ!


పేద విద్యార్థులకు 'ఉపకారం' - పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేశారా?


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..


ఉద్యోగ సంబంధ కధనాల కోసం క్లిక్ చేయండి..