Rahul Gandhi Martial Arts: గతేడాది భారత్ జోడో న్యాయ్ యాత్ర చేశారు రాహుల్ గాంధీ. ఆ సమయంలో ప్రజలతో మమేకమవుతూనే తన ఫిట్‌నెస్‌పైనా ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే మార్షియల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేశారు. ఆయన చేయడమే కాదు. కొంత మంది పిల్లలకూ ట్రైనింగ్ ఇచ్చారు. X వేదికగా ఈ విషయం రాహుల్ వెల్లడించారు. ఓ వీడియోనీ షేర్ చేశారు. త్వరలోనే Bharat Dojo Yatra చేస్తానంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. డోజో అంటే మార్షియల్ ఆర్ట్స్ నేర్పించే ట్రైనింగ్ హాల్. వేలాది కిలోమీటర్లు ప్రయాణిస్తూనే jiu-jitsu మార్షియల్ ఆర్ట్స్‌ని ప్రాక్టీస్ చేయడం మానలేదని చెప్పారు రాహుల్. క్యాంప్‌లలోనే ఈ ప్రాక్టీస్ కొనసాగించారు. యాత్రలో అందరినీ చురుగ్గా ఉంచేందుకు ఈ ప్రాక్టీస్ చేయించినట్టు వెల్లడించారు. దాదాపు రెండు నెలల పాటు ఈ భారత్ జోడో న్యాయ్ యాత్ర కొనసాగింది. అంతకు ముందు ఏడాది..అంటే 2022లో భారత్ జోడో యాత్ర మొదలు పెట్టారు రాహుల్ గాంధీ. (Also Read: Suicides: షాకింగ్ రిపోర్ట్, భారత్‌లో పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు - ఆ రాష్ట్రాల్లో మరీ దారుణం)


"భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా వేలాది కిలోమీటర్లు ప్రయాణించాను. ప్రతి రోజూ మా క్యాంప్‌సైట్‌లో మార్షియల్ ఆర్ట్స్‌ ప్రాక్టీస్‌ని కొనసాగించాను. నాతో పాటు అందరినీ చురుగ్గా ఉంచేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడింది. ఈ మార్షియల్ ఆర్ట్‌ని ఈ తరం పిల్లలకు పరిచయం చేయాలన్నదే నా లక్ష్యం. ఈ ఆర్ట్స్ ద్వారా ఎలాంటి హింస లేకుండానే సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవచ్చు. సమాజంలో అందరూ సేఫ్‌గా ఉండాలంటే ఇలాంటి టెక్నిక్స్ కచ్చితంగా నేర్చుకోవాలి"


- రాహుల్ గాంధీ 






ఈ వీడియోలో రాహుల్ గాంధీ చిన్నారులకు మార్షియల్ ఆర్ట్స్‌లో టెక్నిక్స్ నేర్పించారు. Aikido లో బ్లాక్‌బెల్ట్ సాధించానని, jiu-jitsu లో బ్లూ బెల్ట్ వచ్చిందని ఆయన వివరించారు. ఈ తరం పిల్లలందరికీ దీన్ని పరిచయం చేయాలన్న ఉద్దేశంతోనే ప్రాక్టీస్ చేసినట్టు చెప్పారు. ఎలాంటి హింస లేకుండా చాలా సులువుగా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవచ్చని అన్నారు. యువతను హింస వైపు వెళ్లకుండా ఇలాంటి మార్షియల్ ఆర్ట్స్‌వైపు మళ్లించేలా చొరవ చూపిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఈ వీడియో షేర్ చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెల్ఫ్ డిఫెన్స్‌కి ఇది బెస్ట్ ఆప్షన్ అని చాలా మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 


Also Read: Viral Video: ట్రాక్‌ దాటుతుండగానే దూసుకొచ్చిన ట్రైన్‌, మధ్యలో ఇరుక్కుపోయిన మహిళ - అంతలో ఏం జరిగిందంటే?