Viral News in Telugu: రైల్వే ట్రాక్‌లు దాటొద్దని, ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని అధికారులు ఎంతగా చెబుతున్నా కొంత మంది వినడం లేదు. చివరకు ప్రమాదానికి బలి అవుతున్నారు. లేదా తీవ్రంగా గాయపడుతున్నారు. ఇటీవలే ఇలాంటి ఘటనే జరిగింది. సమయానికి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీస్ స్పందించడం వల్ల ఆ మహిళ ప్రాణాలతో బయటపడింది. మహారాష్ట్రలోని జలగావ్ రైల్వే స్టేషన్ వద్ద ఓ మహిళ ట్రాక్ దాటేందుకు ప్రయత్నించింది. అయితే..అప్పటికే రైల్ వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కాక అలాగే నిలబడిపోయింది. అప్పటికే ఆమెని గుర్తించిన RPF పోలీస్ ఆమెని ప్లాట్‌ఫామ్‌పైకి లాగేందుకు ప్రయత్నించాడు. కానీ అది సాధ్య పడలేదు.
ప్లాట్‌ఫామ్‌కి, ట్రైన్‌కి మధ్య నలిగిపోయింది. వాటి మధ్య చిక్కుకుపోవడం వల్ల ట్రైన్ కొంత దూరం వరకూ లాక్కెళ్లింది. ఆమెని ఎలాగైనా కాపాడాలని ఆ పోలీస్ సాహసం చేసి ఆమెని చాలా చాకచక్యంగా పైకి లాగాడు. అలా ప్రాణాలు కాపాడాడు. ఇది చూసిన వెంటనే అంతా అప్రమత్తమై అక్కడికి వచ్చారు. పోలీసులతో పాటు ప్రయాణికులు అక్కడికి వచ్చి ఆమెకి సాయం అందించారు. ఆ తరవాత హాస్పిటల్‌కి తరలించారు. ఆ పోలీస్ కాపాడకపోయుంటే ప్లాట్‌ఫామ్, రైల్ మధ్యలో నలిగిపోయి బాధితురాలు ప్రాణాలు కోల్పోయేది. అక్కడి సీసీ కెమరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.
Also Read: Gujarat Rains: గుజరాత్‌ని ముంచెత్తుతున్న వరదలు, మూడు రోజుల్లోనే విలయం - 28 మంది మృతి