Rahul Gandhi Favourite Cook:



యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ  


కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సరదాగా మాట్లాడారు. తనకు ఇష్టమైన వంటలేంటో చెప్పిన రాహుల్ ఫేవరేట్ కుక్ ఎవరన్నదీ రివీల్ చేశారు. 'Khaane Mein Kya Hai' అనే యూట్యూబ్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ చాలా బాగా వంట చేస్తారని ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు రాహుల్. కానీ తన అమ్మ వండిన వంటలే తనకు ఎంతో నచ్చుతాయని అన్నారు. 


"ఫుడ్ అంటే నాకెంతో ఇష్టం. లాలూ ప్రసాద్ యాదవ్ చాలా బాగా వంట చేస్తారు. కానీ మా అమ్మ చేసిన వంటకు ఏదీ సాటి రాదు. మా అమ్మ వంట ప్రియాంకకు నచ్చదు. అయినా సరే వంటల్లో మా అమ్మే నంబర్ వన్. సెకండ్ ర్యాంక్ ప్రియాంకకు ఇచ్చేస్తాను. ఉదయమే కాఫీ తాగుతాను. కేవలం రాత్రి పూట మాత్రమే టీ తాగుతాను. ఫ్రెంచ్ డిసర్ట్స్ కన్నా నాకు మన ఇండియన్ స్వీట్స్ అంటేనే చాలా ఇష్టం. స్పైసీ ఫుడ్ చాలా తక్కువే తింటాను"


- రాహుల్ గాంధీ






ఇటీవలే రాహుల్ గాంధీ ఓల్డ్ ఢిల్లీలోని మతియా మహల్ మార్కెట్‌, బెంగాలి మార్కెట్‌కు వెళ్లారు. అక్కడ చాలా సేపు షాపింగ్ చేశారు. అక్కడి ఫేమస్ వంటకాలన్నీ రుచి చూశారు. స్థానికంగా అందరూ ఎంతో ఇష్టపడే షర్బత్ తాగారు. పండ్లు తిన్నారు. ఆ తరవాత పానీపూరి కూడా టేస్ట్ చేశారు. అక్కడే కాదు. ఢిల్లీలోని ఫేమస్ ఫుడ్ పాయింట్‌లకు వెళ్లి సందడి చేశారు. 






రాహుల్ గాంధీ తన అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు. అనర్హతా వేటు పడిన తరవాత ఆ బంగ్లా వదిలి వెళ్లిపోవాలని నోటీసులు అందాయి. ఈ మేరకు ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. తల్లి సోనియా గాంధీ ఇంటికి మకాం మార్చారు. ఈ సందర్భంగా రాహుల్ మీడియాతో మాట్లాడారు. నిజం మాట్లాడినందుకే తాను ఇలా మూల్యం చెల్లించుకుంటున్నానని అన్నారు. దాదాపు 19 ఏళ్లుగా ఆ బంగ్లాలో ఉంటున్నానని, ఎన్నో జ్ఞాపకాలున్నాయని చెప్పారు. 


"ఈ దేశ ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. 19 ఏళ్ల పాటు ఆ బంగ్లాలో ఉండే అవకాశం ఇచ్చారు. వాళ్లందరికీ నా కృతజ్ఞతలు. నిజం మాట్లాడినందుకు మూల్యం చెల్లించుకుంటున్నాను. నిజం కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు నేను రెడీగా ఉన్నాను"


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత 


Also Read: PM Modi Kerala visit: ప్రధానిని చంపేస్తామంటూ లేఖ, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు