PM Modi Kerala visit:



ఆత్మాహుతి దాడి బెదిరింపులు 
 
ప్రధాని మోదీపై ఆత్మాహుతి దాడికి పాల్పడతామంటూ బెదిరింపు లేఖ రాసిన నిందితులను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళలో రెండ్రోజుల పర్యటనకు ప్రధాని రానున్నారు. ఈ క్రమంలోనే ఆయనను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బీజేపీ చీఫ్‌ సురేంద్రన్‌కి లెటర్ వచ్చింది. వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ ప్రారంభించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేరళ సిటీ పోలీస్ కమిషనర్ కే సేతు రామన్ ఇదే విషయాన్ని వెల్లడించారు. 


"ప్రధాని మోదీని హత్య చేస్తామంటూ లెటర్ పంపిన వ్యక్తిని అరెస్ట్ చేశాం. కేవలం వ్యక్తిగత శత్రుత్వంతోనే ఈ పని చేశాడు. ఫారెన్సిక్స్ ద్వారా నిందితుడిని గుర్తించాం"


- కే సేతు రామన్,కేరళ సిటీ పోలీస్ కమిషనర్ 






కేరళ బీజేపీ చీఫ్ కె సురేంద్రన్ దీనిపై స్పందించారు. ప్రధాని మోదీ పర్యటన ప్రశాంతంగా జరిగే చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG)తో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. 


"ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ప్రధాని నరేంద్ర మోదీకి రక్షణ కల్పించనుంది. కేరళ పర్యటన చాలా సాఫీగా సాగిపోతుంది. ప్రధాని ప్రాణాలకు SPG అండగా ఉంటుంది. ఆయనను ఎవరూ అడ్డుకోలేరు. ఈ పర్యటన కచ్చితంగా విజయవంతం అవుతుంది"


- కె సురేంద్రన్, కేరళ బీజేపీ చీఫ్ 






రెండ్రోజుల క్రితం సురేంద్రన్‌కు ఓ లేఖ వచ్చింది. అది మలయాళ భాషలో ఉన్నట్టు ఆయన వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీకి ప్రాణహాని ఉందని ఆ లేఖలో హెచ్చరించారు. ఏప్రిల్ 24వ తేదీన ప్రధాని కొచ్చికి చేరుకుంటారు. అక్కడే రోడ్‌షో నిర్వహిస్తారు. యూత్ మీటింగ్‌కు హాజరవనున్నారు. ఆ తరవాత రాష్ట్రంలోని 9 కీలక చర్చ్‌ల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. మరుసటి రోజు అంటే..ఏప్రిల్ 25న తిరువనంతపురం చేరుకుంటారు. అక్కడే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కి పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. సెంట్రల్ స్టేడియం నుంచి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి నేరుగా గుజరాత్‌కు వెళ్తారు. 


Also Read: Twitter Blue Tick: ట్విటర్‌లో టెక్నికల్ సమస్య, చనిపోయిన వాళ్ల అకౌంట్‌లకూ ఫ్రీగా బ్లూ టిక్‌