ఇన్ని రోజులు పట్టించుకోకుండా పండుగ రోజుల్లో విచారణకు రమ్మని నోటీసులు ఇవ్వడం ఏమిటని వైఎస్ఆర్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ సీఐడీ అధికారులపై మండిపడ్డారు. గతంలో ప్రభుత్వంపై కుట్ర పూరితంగా విమర్శలు చేస్తున్నారని ఏపీసీఐడీ సుమోటోగా కేసు నమోదు చేసి రాజద్రోహం కేసు పెట్టింది. ఈ కేసులో ఆయనకు సుప్రీంకోర్టులో బెయిల్ లభించింది. ఆ తర్వాత ఎప్పుడూ విచారణకు రావాలని సీఐడీ నోటీసులు ఇవ్వలేదు. బుధవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఆయన ఇంటికి నలుగురు సీఐడీ అధికారుల బృందం వచ్చి.. గురువారం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే ఇవాళ నోటీసులు ఇచ్చి ... రేపే విచారణ కావాలని హాజరు కావాలని అడగడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దీంతో  17వ తేదీన విచారణకు రావాలని చెప్పారని రఘురామకృష్ణరాజు మీడియాకు చెప్పారు. 


Also Read: ఎంపీ రఘురామ ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు.. Hydలోని ఇంటి ఎదుట హడావుడి


సీఐడీ నోటీసులు ఇచ్చిన తర్వాత రఘురామ మీడియాతో మాట్లాడుతూ తీవ్రమైన ఆరోపణలు చేశారు.  సీఐడీ అధికారి సునీల్ ఒక ఉన్మాది అని అని మండిపడ్డారు. సంక్రాంతి పండుగలకు తాను భీమవరం వెళ్తున్నానని తెలిసి నోటీసులు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇదంతా చూసి ముఖ్యమంత్రి జగన్ ఆనంద పడుతున్నారని ఎంపీ రఘురామకృష్ణం రాజు విమర్శించారు. తాను రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తినని.. చట్టాన్ని గౌరవిస్తూ విచారణకు హాజరవుతానన్నారు. సీఐడీ వ్యవహరిస్తున్న తీరు అనుమానాస్పదంగా ఉందని.. వారి తీరుపై ఎంక్వైరీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు .


Also Read: ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా... నర్సాపురం వెళ్తున్నా రెండు రోజులు అక్కడే ఉంటా... ఎంపీ రఘురామ


గతంలో అరెస్ట్ చేసే సమయంలో సీసీటీవీ కెమెరాలు లేకుండా చేశారు.. నా సిబ్బందిపై, నా పై వ్యక్తిగతంగా దాడి చేశారని సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన వివరాలు సమర్పించానని  రఘురామ ప్రకటించారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ అనేది లేదన్నారు. రావణ రాజ్యంలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని విమర్శించారు. తాను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని.. గెలిచిన సీటులోనే మళ్లీ పోటీ చేస్తానన్నారు. ఏపీ ప్రభుత్వం వద్ద రోడ్లు వేయడానికి కూడాడబ్బుల్లేవన్నారు. 


Also Read: త్వరలో ఎంపీ పదవికి రఘురామ రాజీనామా ... అమరావతి ఎజెండాతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం !


నర్సాపురం నుంచి వైఎస్ఆర్‌సీపీ తరపున గెలిచిన రఘురామకృష్ణరాజు తర్వాత ఆ పార్టీకి వ్యతిరేకంగా మారారు. విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనపై ఏపీ ప్రభుత్వం రాజద్రోహం కేసు పెట్టి అరెస్టు కూడా చేసింది. అయినా ఆయన విమర్శలు కొనసాగిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందన్న కారణంమగా చాలా రోజులుగా ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. చాలా రోజుల తర్వాత సంక్రాంతి సందర్భంగా ఆయన నర్సాపురం వెళ్తున్నారు. 



Also Read: జగన్ చుట్టూ ప్రమాదకర వ్యక్తులు ! ఎవరిని ఉద్దేశించి ఆర్జీవీ ఇలా చెబుతున్నారు ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి