Porsche Car Accident Case: పూణెలోని పోర్షే కారు హిట్ అండ్ రన్ కేసులో  ఇద్దరు డాక్టర్లను సస్పెండ్ చేశారు. తన కొడుకును కేసు నుంచి రక్షించడానికి తండ్రి తన శాయశక్తులా ప్రయత్నించాడు. నిందితుడు మైనర్ రక్త పరీక్షకు ముందు బిల్డర్ విశాల్ అగర్వాల్ డాక్టర్‌కు 14 సార్లు ఫోన్ చేశాడు. అతడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.  ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.


ప్రభుత్వ ససూన్ ఆసుపత్రి ఫోరెన్సిక్ విభాగాధిపతి డాక్టర్ అజయ్ తావ్డే నిందితుడి తండ్రి విశాల్‌తో 14 సార్లు ఫోన్‌లో మాట్లాడారు. బ్లడ్ శాంపిల్ మార్చే విషయమై ఈ సంభాషణ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పరీక్షల కోసం నమూనాలను తీసుకెళ్తున్నప్పుడు..  నిందితుడి తండ్రి డాక్టర్ తావ్డేకు 14 సార్లు ఫోన్ చేశాడు. ఈ ప్రమాదానికి కారణమైన మైనర్ బ్లడ్ శాంపిల్స్ మార్చినట్లు ఆరోపణలు రావడంతో సా సూన్ జనరల్ ఆస్పత్రి కి చెందిన డా. అజయ్ తవార్, డా. శ్రీహరి హాల్నోర్ లను బుధవారం సస్పెండ్ చేశారు.  ఈ కేసులో వీరితోపాటు మరో ఇద్దరు ఆస్పత్రి సిబ్బందిని సోమవారమే పోలీసులు అరెస్ట్ చేశారు.


సీన్ రీ క్రియేషన్ లో ఏఐ సాయం
ఇప్పుడు బుధవారం ఉదయం పూణే క్రైమ్ బ్రాంచ్ డాక్టర్ అజయ్ తవార్ ఇంటిపై దాడి చేసింది. శాంపిల్‌ను మార్చేందుకు డాక్టర్ అజయ్ తవార్.. మైనర్ తండ్రి విశాల్ అగర్వాల్ నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు క్రైమ్ బ్రాంచ్ అనుమానిస్తోంది. ఇప్పుడు ఈ పూణే హిట్ అండ్ రన్ కేసును పరిష్కరించడంలో ఏఐ సాయం తీసుకోనున్నారు.  పూణే పోర్స్చే కారు ప్రమాద దృశ్యాన్ని రీక్రియేషన్ చేయడానికి పూణే పోలీసులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించనున్నారు.  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సన్నివేశాన్ని రీ క్రియేషన్ చేసేటప్పుడు వాహనాలు, రోడ్లకు సంబంధించిన కేంద్ర ఏజెన్సీల సహాయం కూడా తీసుకోనున్నారు.


ఇద్దరు డాక్టర్ల అరెస్ట్
 పూణె పోలీసులు ఇప్పటికే తవార్ ను అరెస్ట్ చేశారు. ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీహరి హాల్నోర్, సిబ్బంది అతుల్ ఘట్కాంబ్లేను కూడా పోలీసులు మే 19న అరెస్టు చేశారు. మైనర్ శాంపిల్‌ను డస్ట్‌బిన్‌లో విసిరి, మరొక వ్యక్తి నమూనాతో మార్పిడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.  మే 19న పూణేలోని కళ్యాణి నగర్ ప్రాంతంలో మద్యం మత్తులో విశాల్ అగర్వాల్  కుమారుడు తన పోర్షే కారుతో మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు ఐటీ నిపుణులు మృతి చెందారు. ప్రమాదానికి ముందు మైనర్ రెండు పబ్బులకు వెళ్లి మద్యం సేవించినట్లు తేలింది.


సంభాషణ ఎప్పుడు, ఎలా జరిగింది?
డాక్టర్ అజయ్ తవార్ విశాల్ అగర్వాల్ మధ్య మొదటి సంభాషణ రాత్రి 8.45 గంటలకు జరిగిందని అధికారులు తెలిపారు. ఉదయం 11 గంటల వరకు ఇద్దరి మధ్య దాదాపు 14 సంభాషణలు జరిగాయి. కొన్నిసార్లు వాట్సాప్ కాల్స్ ద్వారా, కొన్నిసార్లు ఫేస్ టైమ్ ద్వారా..  కొన్నిసార్లు సాధారణ కాల్స్ ద్వారా మాట్లాడుకుంటూనే ఉన్నారు. పూణే పోలీసులు జరిపిన సోదాల్లో తవార్ ఇంటి నుంచి మునుపటి కేసులకు సంబంధించిన కొన్ని పత్రాలు లభించాయని అధికారులు తెలిపారు. వీటిపై తవార్ ను పోలీసులు విచారిస్తున్నారు. డాక్టర్ అజయ్ తవార్ కు విశాల్ అగర్వాల్ కుటుంబం  పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తానని హామీ ఇచ్చిందని పోలీసు వర్గాలు తెలిపాయి. అజయ్ తవార్ తనకు మద్యం తీసుకురావాలని ఆసుపత్రి సిబ్బందిని తరచూ అడిగేవాడిని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


డీల్ ఖరీదు ఎంత?
పోర్షే కారు యాక్సిడెంట్‌లో మైనర్ నిందితుడి బ్లడ్ శాంపిల్ స్థానంలో మరో వ్యక్తి రక్త నమూనాను ఇవ్వడానికి సాసూన్ ఆసుపత్రికి లంచం ఇచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ మొత్తం ఎంత అనేది విచారణలో తేలాల్సి ఉంది. నిందితుడైన వైద్యులను కలవడానికి ఎవరు వచ్చారో తెలుసుకోవడానికి పోలీసులు ససూన్ ఆసుపత్రిలోని సిసిటివి కెమెరాలు ..  దాని డివిఆర్ నుండి ఫుటేజీని రికవరీ చేస్తున్నారు. ప్రస్తుతం,అజయ్ తవార్, ఇతర వైద్యులు మే 30 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.