Dalip Singh Rana Joins BJP: భాజపాలో చేరిన 'ద గ్రేట్ ఖలీ'- స్టార్ రెజ్లర్ గురించి ఆసక్తికర విషయాలివే!

ABP Desam Updated at: 10 Feb 2022 03:42 PM (IST)
Edited By: Murali Krishna

ద గ్రేట్ ఖలీ.. భాజపాలో చేరారు. భాజపా జాతీయ విధానం నచ్చి పార్టీలో చేరినట్లు తెలిపారు.

భాజపాలో చేరిన ఖలీ

NEXT PREV

డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్, ద గ్రేట్ ఖలీ (దలీప్ సింగ్ రాణా).. భారతీయ జనతా పార్టీలో చేరారు. దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో ఆయన పార్టీ తీర్థం తీసుకున్నారు. 











భాజపాలో చేరినందుకు సంతోషంగా ఉంది. దేశానికి ఆయన చేస్తోన్న సేవలు చూస్తుంటే ప్రధానిగా ఆయనే సరైన వ్యక్తి అనిపిస్తోంది. అందుకే దేశాభివృద్ధి కోసం ఆయనతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నాను. భాజపా జాతీయ విధానం నన్ను ప్రభావితం చేసింది. -                                              ద గ్రేట్ ఖలీ


ఎన్నో రికార్డులు..



  • ది గ్రేట్ ఖలీ అసలు పేరు దలీప్ సింగ్ రాణా. ఆయన 1972 ఆగస్టు 27న హిమాచల్ ప్రదేశ్‌లో జన్మించారు.

  • ఖలీ ఓ ప్రొఫెషనల్ రెజ్లర్ మాత్రమే కాదు నటుడు, పవర్‌లిఫ్టర్.

  • 1995,1996 సంవత్సరాల్లో 'మిస్టర్ ఇండియా' టైటిల్ గెలుచుకున్నారు.

  • వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) లోకి వెళ్లిన తర్వాత ఖలీ.. బాగా ఫేమస్ అయ్యారు.

  • అంతకుముందు పంజాబ్ రాష్ట్ర పోలీసు అధికారిగా ఆయన పనిచేశారు.

  • ఖలీ.. పొడవు 7 అడుగుల మూడు అంగుళాలు. బరువు సుమారు 200 కిలోలు.


డబ్ల్యూడబ్ల్యూఈలో..


గ్రేట్ ఖలీ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (WWE) సూపర్ స్టార్లతో పోరాడాడు. జాన్ సెనా, బటిస్టా, అండర్ టేకర్.. ఇలా ఎంతోమంది స్టార్ రెజ్లర్లతో ఆడాడు. 


Also Read: Karnataka Hijab Row: 'హిజాబ్' కేసు అత్యవసర బదిలీకి సుప్రీం నో.. జోక్యం చేసుకోబోమని వ్యాఖ్య


Also Read: Covid Update: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 67,084 మందికి వైరస్

Published at: 10 Feb 2022 02:59 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.