దేశంలో కొత్తగా 67,084 కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారం కంటే ఈరోజు కరోనా కేసులు కాస్త తగ్గాయి. కొత్తగా 1,241 మంది మృతి చెందారు. 1,67,882 మంది కరోనా నుంచి కోలుకున్నారు.








  • యాక్టివ్ కేసులు: 7,90,789 (1.86%)

  • మొత్తం మరణాలు: 5,06,520

  • డైలీ పాజిటివిటీ రేటు: 4.44%

  • మొత్తం వ్యాక్సినేషన్: 1,71,28,19,947


వ్యాక్సినేషన్..







దేశంలో ఇప్పటివరకు 171 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. బుధవారం ఒక్కరోజే 44 లక్షలకు పైగా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.


15-18 ఏళ్ల మధ్య ఉన్న కోటి మంది పిల్లలకు రెండు డోసుల వ్యాక్సిన్ అందించినట్లు అధికారులు తెలిపారు.


మహారాష్ట్ర.. 


మహారాష్ట్రలో కొత్తగా 7,142 కరోనా కేసులు నమోదయ్యాయి. 92 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,43,247కు పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 75,93,291 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒమిక్రాన్ కేసులు తాజాగా ఏం నమోదు కాలేదు.


Also Read: PM Modi Interview: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం బీజేపీదే, జాతీయ ప్రయోజనాల కోసమే వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకున్నాం | ఏఎన్‌ఐతో ప్రధాని మోదీ


Also Read: RBI Policy Highlights: మార్పుల్లేవ్‌! వరుసగా పదోసారీ యథాతథంగా రెపో, రివర్స్‌ రెపో రేట్లు