Priyanka Gandhi's Insta Post: 'ఇదంతా కేవలం ప్రేమ కోసమే చేశావ్‌'- ప్రియాంక గాంధీ ఎమోషనల్ పోస్ట్

Advertisement
ABP Desam   |  Edited By: Murali Krishna Updated at: 27 Oct 2022 10:53 AM (IST)

Priyanka Gandhi's Insta Post: తన తల్లి సోనియా గాంధీ గురించి ప్రియాంక గాంధీ ఓ భావోద్వేగపూరిత పోస్ట్ చేశారు.

'ఇదంతా కేవలం ప్రేమ కోసమే చేశావ్‌'- ప్రియాంక గాంధీ ఎమోషనల్ పోస్ట్

NEXT PREV

Priyanka Gandhi's Insta Post: కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను మల్లికార్జున్ ఖర్గేకు సోనియా గాంధీ బుధవారం అప్పజెప్పారు. ఇది జరిగిన కొన్ని గంటలకు తన తల్లి సోనియా గాంధీ గురించి ప్రియాంక గాంధీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

Continues below advertisement







నిన్ను చూస్తే గర్వంగా ఉందమ్మా! ప్రపంచం ఏమనుకున్నా.. ఏం ఆలోచించినా సరే. నాకు తెలుసు ఇదంతా కేవలం ప్రేమ కోసమే చేశావ్‌ అని!                                         - ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నాయకురాలు


ఈ పోస్ట్‌లో ఉన్న ఫొటోలో సోనియా గాంధీ.. తన భర్త రాజీవ్ గాంధీ చిత్రాన్ని పైకెత్తి చూపిస్తూ ఆనందంగా కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని మల్లికార్జున్ ఖర్గే.. సోనియా గాంధీకి బహుకరించారు.


కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా 1998 నుంచి 2017 వరకు సోనియా పనిచేశారు. 2019 నుంచి బుధవారం వరకు ఆమె పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగారు. 1991లో తన భర్త రాజీవ్‌ గాంధీ మరణించే సమయానికి సోనియా గాంధీ రాజకీయాలకు దూరంగా ఉండేవారు. కానీ, పరిస్థితుల ప్రభావం కారణంగా 1997లో తొలిసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ మరుసటి ఏడాదే పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. 


ఖర్గే


మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడిగా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. దిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. సోనియా గాంధీ అధికారికంగా తన బాధ్యతలను ఖర్గేకు అప్పగించారు. ఖర్గే ఆధ్వర్యంలో పార్టీ ముందుకెళ్తుందని ఆకాంక్షించారు. ప్రమాణస్వీకారం చేశాక ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు.


" ఈ క్షణం నేనెంతో భావోద్వేగానికి గురవుతున్నాను. ఓ సాధారణ కార్మికుడి కొడుకుని కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడటం నా ప్రధాన బాధ్యత. అంతే కాదు. రాజకీయాల్లో "త్యాగం" గురించి మాట్లాడాలంటే ముందుగా సోనియా గాంధీ గురించే చెప్పాలి. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ నేతృత్వంలో యూపీఏ ఎంతో పురోగతి సాధించింది. ప్రస్తుతం పార్టీకి గడ్డుకాలం నడుస్తోంది. ప్రజాస్వామ్యంలో మార్పులు తెచ్చేందుకు శ్రమిస్తున్నాం. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని బలహీన పరిచింది. ఈ విద్వేషాలు, అబద్ధాలు, మోసాలను ఛేదించి తీరతాం. 137 ఏళ్లుగా కాంగ్రెస్ చరిత్ర ప్రజలతోనే ముడి పడి ఉంది. పార్టీలో యువతకు ప్రాధాన్యతనివ్వడంపై దృష్టి సారిస్తున్నాం.                                                  "




- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు

 



Published at: 27 Oct 2022 10:46 AM (IST)
Continues below advertisement
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.