Madhya Pradesh Murder: మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన జరిగింది. తన భార్యను చూశారనే కారణంతో 32 ఏళ్ల దళిత వ్యక్తి సహా అతని తల్లిదండ్రులను కాల్చి చంపేశాడు ఓ దుండగుడు. ఈ ఘటనపై తీవ్ర దుమారం రేగింది. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇదీ జరిగింది
దామోహ్ జిల్లాలో మంగళవారం ఈ ఘటన జరిగింది. తన భార్యను చూశారనే కారణంతో 32 ఏళ్ల దళిత వ్యక్తి, సహా అతని తల్లిదండ్రులను దుండగులు కాల్చి చంపారు. ఈ దాడిలో మరో ఇద్దరు గాయపడ్డారు. ప్రధాన నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
దామోహ్ జిల్లా హెడ్ కార్వర్ట్స్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేహత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవ్రాన్ గ్రామంలో మంగళవారం ఉదయం 6.30 గంటలకు ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
ఘటన తర్వాత సాగర్ జోన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ అనురాగ్ ఆ గ్రామాన్ని సందర్శించారు. దాడిలో మరణించిన దంపతుల పెద్ద కుమారుడు.. ప్రధాన నిందితుడైన జగదీష్ పటేల్ భార్యను తరచూ చూస్తూ ఉండేవాడని తెలిపారు. ఈ కారణంగానే పక్కా పథకం ప్రకారం హత్య చేశారని తెలిపారు. హత్యానంతరం పటేల్‌ను అరెస్టు చేసినట్లు ఐజీ తెలిపారు.
కాంగ్రెస్ డిమాండ్
దళిత కుటుంబానికి చెందిన ముగ్గురి హత్యపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆ కుటుంబానికి భద్రత కల్పించాలని, వారిని అన్ని విధాలా ఆదుకోవాలని ఆయన అన్నారు.