కాంగ్రెస్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు దేశంలో యూపీఏ ఏక్కడా లేదని బంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శలు ఎక్కు పెట్టిన మరుసటి రోజే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. కాంగ్రెస్‌పై కౌంటర్లు వేశారు. గత 10 ఏళ్లలో కాంగ్రెస్ 90 శాతం ఎన్నికల్లో ఓటమిపాలైందని విమర్శించారు. కాంగ్రెస్‌లో చేరేందుకు నెల క్రితం వరకు రాహుల్ గాంధీతో చర్చలు జరిపిన పీకే.. ఇప్పుడు హస్తం పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాహుల్‌పై..
పీకే పెట్టిన ట్వీట్ కచ్చితంగా రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తున్నట్లే ఉందని విశ్లేషకులు అంటున్నారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఇప్పటికే పార్టీ పెద్దలు సహా విపక్షాలు సవాల్ చేస్తున్నాయి. నిన్న మమతా బెనర్జీ కూడా రాహుల్ గాంధీపై విమర్శల దాడి చేశారు.
భాజపాను దీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ కాకుండా మరో ప్రత్యామ్నాయ శక్తి కావాలని దీదీ అంటున్నారు. పీకే చేసిన కామెంట్స్ కూడా దీదీకి మద్దతుగానే ఉన్నాయి. మరి తొందర్లో మరో కూటమి తెరపైకి వచ్చే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ లేకుండా ప్రాంతీయ పార్టీలతో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని దీదీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం దీదీ పలు పార్టీల అధినేతలతో వరుస భేటీలు అవుతున్నారు.
Also Read: Delhi Air Pollution: దిల్లీ సర్కార్‌కు సుప్రీం డెడ్‌లైన్.. రేపటి నుంచి పాఠశాలలు బంద్
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 9,765 కరోనా కేసులు నమోదు, 477 మంది మృతి
Also Read: ఈ మొక్క ఆకులు పంచదార కన్నా వందరెట్లు తీపి... చక్కెర బదులు దీన్ని వాడితే బెటర్
Also Read: ఈ ఆరు లక్షణాలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోకండి... జీవితం నరకమైపోతుంది
Also Read: టమోటో సూప్‌ను ఇలా చేసుకుని తాగండి... క్యాన్సర్‌ను కూడా అడ్డుకుంటుంది
Also Read: ఎయిడ్స్ లక్షణాలు ఏంటి? ఆ రోగులు ఏం తినాలి? ఏం తినకూడదు?
Also Read: ఓమ్రికాన్ వేరియంట్ వేళ...ఈ బ్లడ్ గ్రూపుల వాళ్లకే హై రిస్క్, చెబుతున్న ఇండియన్ అధ్యయనం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి