డియోగర్-కోల్‌కతా మధ్య విమాన సేవలు
ఝార్ఖండ్‌లోని డియోగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. జులై 12వ తేదీ ఈ కార్యక్రమం జరగనుంది. ఈ ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వచ్చిన వెంటనే కోల్‌కతా నుంచి డియోగర్‌కు ఫ్లైట్స్ నడుపుతామని ఇండిగో ప్రకటించింది.
ఈ విమానాశ్రయానికి ఏరోడ్రోమ్ లైసెన్స్‌ను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్-DGCA జారీ చేసింది. A321,B737 లాంటి నారో బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌లను నడుపుకునేందుకు అనుమతినిచ్చింది. జులై 12వ తేదీ నుంచి వారానికో ఫ్లైట్ డియోగర్, కోల్‌కతా మధ్య నడిపేలాపర్మిషన్ ఇచ్చారు. అంటే నెలకు నాలుగు ట్రిప్‌లు ఉంటాయి. ఈ సేవల వల్ల రెండు రాష్ట్రాలకు కనెక్టివిటీ పెరగటంతో పాటు టైమ్ కూడా చాలా వరకు ఆదా అవుతుందని ఇండిగో అధికారులు చెబుతున్నారు. రోడ్డు మార్గంలో అయితే డియోగర్ నుంచి కోల్‌కతాకు దాదాపు 7.5గంటల సమయం పడుతుంది. అదే ఫ్లైట్‌లో అయితే గంటన్నరలో గమ్యస్థానం చేరుకోవచ్చు.
675 ఎకరాల్లో..భారీ రన్‌వేతో..
ఈ విమాన సేవలు అందుబాటులోకి రావటం వల్ల పర్యాటకంగానూ ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు. డియోగర్‌లో బాబా బైద్యనాథ్ ఆలయం, త్రికుట పర్వత, రామకృష్ణ మిషన్ విద్యాపీఠ్, నకుల మందిర్ లాంటి పర్యాటక ఆకర్షణలున్నాయి. ఎయిర్ సర్వీసెస్ వల్ల పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఈ ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించే ముందు రెండు సార్లు ట్రయల్ రన్స్ చేయనున్నారు. రాంచీలో ఇప్పటికే బిర్సా ముండా అంతర్జాతీయ విమానాశ్రయం ఉండగా, ఇప్పుడు డియోగర్ ఎయిర్‌పోర్ట్ కూడా అందుబాటులోకి రానుంది. 657ఎకరాల్లో రూ.401 కోట్లతో ఈ విమానాశ్రయం నిర్మించారు. 2,500 మీటర్ల పొడవైన రన్‌వేను ఏర్పాటు చేశారు. ఎయిర్‌బస్‌లు సులువుగా టేకాఫ్, ల్యాండింగ్ అయ్యేందుకు వీలవుతుంది. 5,130 చదరపు అడుగుల్లో టర్మినల్ నిర్మాణం చేపట్టారు. ఇందులో 6 చెక్ ఇన్ డెస్క్‌లు ఉంటాయి. ఒకేసారి 200 మంది ప్రయాణికులు వెళ్లే విధంగా దీన్ని డిజైన్ చేశారు. పర్యావరణహితంగా నిర్మించిన ఈ ఎయిర్‌పోర్ట్‌లో అధునాతన సౌకర్యాలున్నట్టు అధికారులు తెలిపారు.
Also Read: India Wheat Flour Export: గోధుమ పిండినీ ఎక్స్‌పోర్ట్ చేయటానికి వీల్లేదు, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు