చియాన్ విక్రమ్‌కు హార్ట్ ఎటాక్ రాలేదని ఆయన మేనేజర్ ఎం. సూర్యనారాయణ స్పష్టం చేశారు. హీరో ఆరోగ్యం గురించి జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన ట్వీట్ చేశారు. ఛాతిలో నొప్పి రావడంతో చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో విక్రమ్ చేరిన సంగతి తెలిసిందే. దాంతో ఆయనకు హార్ట్ ఎటాక్ అని ప్రచారం జరిగింది. దీనిపై విక్రమ్ మేనేజర్ వివరణ ఇచ్చారు.
''ప్రియమైన అభిమానులకు, శ్రేయోభిలాషులకు... చియాన్ విక్రమ్‌కు ఛాతిలో నలతగా అనిపించింది. అందుకు చికిత్స తీసుకుంటున్నారు. ఆయనకు హార్ట్ ఎటాక్ రాలేదు. ఈ విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. పుకార్లు మమ్మల్ని ఎంతగానో బాధించాయి. విక్రమ్, ఆయన కుటుంబ సభ్యులకు ఇప్పుడు ప్రైవసీ కావాలి. ఇప్పుడు ఆయన బావున్నారు. ఒక్క రోజులో ఆస్పత్రి నుంచి డిశ్చార్చి అవుతారు. ఈ స్టేట్‌మెంట్‌తో అందరికీ క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాను. ఇంతటితో తప్పుడు ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడతారని ఆశిస్తున్నాను'' అని విక్రమ్ మేనేజర్ సూర్యనారాయణ ట్వీట్ చేశారు.
కరోనా కేసులు మళ్ళీ పెరుగుతుండటంతో చియాన్ విక్రమ్ ఆసుపత్రిలో చేరారని తెలియగానే... ఆయన అభిమానులు కాస్త కంగారు పడ్డారు. అయితే... విక్రమ్ మేనేజర్ ట్వీట్‌తో వాళ్ళు హ్యాపీగా ఫీలవుతున్నారు.
Also Read : 'హ్యాపీ బర్త్ డే' రివ్యూ: బోరింగ్ బర్త్ డే పార్టీనా? అంతా హ్యాపీనా?
సినిమాలకు వస్తే... మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న 'పొన్నియన్ సెల్వన్ 1'లో చోళ రాజు ఆదిత్య కరికాలన్ పాత్రలో విక్రమ్ నటించారు. ఇటీవల ఆయన లుక్ విడుదల చేశారు. ఈ రోజు సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Also Read : నాయకుడు అధికారాన్ని కోరుకోవడం కాదు, నాయకుడినే అధికారం వెతుక్కుంటూ రావాలి - ‘పరంపర సీజన్ 2’ ట్రైలర్ అదుర్స్!