తమిళ కథానాయకుడు, తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన విక్రమ్ (Vikram) ఇప్పుడు ఆస్పత్రిలో ఉన్నారు. ఆయనకు గుండెల్లో నొప్పి రావడంతో చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తీసుకు వెళ్లినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. విక్రమ్‌కు హార్ట్ ఎటాక్ వచ్చినట్టు కోలీవుడ్ టాక్. ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారట. అయితే... జ్వరంతో విక్రమ్ ఆసుపత్రిలో చేరారని, సీరియస్ ఏమీ కాదని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఆస్పత్రి నుంచి ఆయనను డిశ్చార్జి చేశారని తెలిపారు. మరి కాసేపటిలో అధికారికంగా విక్రమ్ హెల్త్ వివరాల్ని అధికారికంగా ప్రకటించనున్నారు.
కరోనా కేసులు మళ్ళీ పెరుగుతుండటంతో చియాన్ విక్రమ్ అభిమానులు కాస్త కంగారు పడుతున్నారు. ప్రస్తుతం విక్రమ్ వయసు 56 ఏళ్ళు. పాత్ర కోసం బరువు పెరగడం, అవసరం అయితే విపరీతంగా తగ్గడం ఆయనకు అలవాటు. 'ఐ' కోసం వెయిట్ బాగా తగ్గారు. అప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే... ఆ తర్వాత ఆయనకు ఆరోగ్య సమస్యలు ఏవీ లేవు.
Also Read : 'హ్యాపీ బర్త్ డే' రివ్యూ: బోరింగ్ బర్త్ డే పార్టీనా? అంతా హ్యాపీనా?
సినిమాలకు వస్తే... మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న 'పొన్నియన్ సెల్వన్ 1'లో చోళ రాజు ఆదిత్య కరికాలన్ పాత్రలో విక్రమ్ నటించారు. ఇటీవల ఆయన లుక్ విడుదల చేశారు. విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే.
Also Read : నాయకుడు అధికారాన్ని కోరుకోవడం కాదు, నాయకుడినే అధికారం వెతుక్కుంటూ రావాలి - ‘పరంపర సీజన్ 2’ ట్రైలర్ అదుర్స్!