PM Modi to Rishi Sunak:
ద్వైపాక్షిక అంశాల చర్చ
ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పలు ద్వైపాక్షిక అంశాలు ప్రస్తావించారు. ఖలిస్థాన్ వేర్పాటు వాదుల ఉద్యమంపైనా చర్చించారు. ఇటీవలే లండన్‌లోని ఇండియన్ ఎంబసీపై ఉన్న భారత దేశ త్రివర్ణ పతాకాన్ని తొలగించిన ఘటన సంచలనమైంది. ఖలిస్థాన్ ఉద్యమకారులు భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఘటనను భారత్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఆ తరవాత రిషి సునాక్‌తో ప్రధాని మోదీ మాట్లాడటం ఇదే తొలిసారి. భారతీయుల భద్రతకు భరోసా ఇవ్వాలని ప్రధాని మోదీ కోరారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ట్విటర్ వేదికగా పోస్ట్‌లు చేసింది.
"ప్రధాని మోదీ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ద్వైపాక్షిక సంబంధాల గురించి ప్రస్తావించారు. యాంటీ ఇండియా ఉద్యమాలపైనా ఆరా తీశారు. అలాంటి వేర్పాటు వాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని సునాక్‌ను కోరారు. దీనిపై సునాక్ సానుకూలంగా స్పందిచారు. ఇండియన్ హై కమిషన్‌పై జరిగిన దాడిని ఖండించారు. ఇండియన్ కమిషన్‌తో పాటు అందులో పని చేసే సిబ్బంది భద్రతకు భరోసా ఇచ్చారు"
- ప్రధాని మోదీ కార్యాలయం
నీరవ్ మోదీ ప్రస్తావన..
భారత్‌లో కోట్ల కొల్లగొట్టి లండన్‌కు పారిపోయిన నీరవ్ మోదీని అప్పగించే విషయాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. అలాంటి వాళ్లను సహించకుండా వెంటనే భారత్‌కు పంపాలని కోరారు. నిజానికి ఈ ఇద్దరు నేతలు ఇప్పటికే మాట్లాడుకోవాల్సి ఉంది. రెండు దేశాల మధ్య Free Trade Agreement (FTA) జరగాల్సి ఉంది. అయితే...ఇండియన్ కమిషన్‌పై ఖలిస్థాన్ వేర్పాటువాదులు దాడి చేసినప్పటికీ యూకే ప్రభుత్వం పెద్దగా స్పందించలేదన్న అసహనంతో ఉంది భారత్. అందుకే...రిషి సునాక్‌తో మాట్లాడేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదని లండన్ మీడియా వెల్లడించింది. కానీ...ఇందులో నిజం లేదని భారత్ తేల్చి చెప్పింది. త్వరలోనే ఈ ఒప్పందం కుదురుతుందని తెలిపింది. IndiaUK Roadmap 2030పై ఇద్దరు నేతలూ చర్చించినట్టు భారత ప్రభుత్వం పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత్‌లో జరగనున్న G20 సమావేశానికీ రిషి సునాక్‌ను ప్రధాని మోదీ ఆహ్వానించారని తెలిపింది. బీబీసీపై ఈడీ కేసు నమోదు చేయడంపైనా ప్రస్తావించినట్టు సమాచారం.
Also Read: Asad Ahmed Encounter: పాకిస్థాన్‌నూ భయపెడుతున్న సీఎం యోగి, అసద్ ఎన్‌కౌంటర్‌తో వార్నింగ్